తెలంగాణ ఎన్నికల్లో అనేక ప్రచార పదనిసలు చోటు చేసుకుంటున్నాయి. ఒక్కో పార్టీ నేతలది ఒక్కో అంశం - ఆవేదన....ఆందోళన... సమస్య. అలా తెలంగాణలోని ప్రధాన పార్టీల్లో ఒకటైన కాంగ్రెస్ పార్టీకి చెందిన నేత ఒకరు ఆవేదన చెందుతున్నారు. హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న పార్టీకి చెందిన నేత ఈసీకి ప్రత్యేక ఫిర్యాదు చేస్తున్నారు. ఇంతకీ ఆయన ఎవరంటే...కాంగ్రెస్ నాంపల్లి అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి మహమ్మద్ ఫిరోజ్ ఖాన్. ఇంతకీ ఆవేదన ఏమంటే - తన అసెంబ్లీ నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాల్లో సీసీటీవీలు ఏర్పాటు చేయాలట. అంతేకాకుండా బుర్ఖాల్లో వచ్చే మహిళలను కూడా తనిఖీ చేయాలని కోరుతున్నారు.
ఎన్నికల సంఘానికి దాఖలు చేసిన పిటిషన్ ప్రకారం - తనకు ఎమ్ ఐఎమ్ కార్యకర్తలు నుంచి ప్రమాదం పొంచి ఉందని... గత రెండు ఎన్నికల్లో తనపై ఇప్పటికే పలుమార్లు హత్యాయత్నాలు జరిగిన దృష్ట్యా తనకు టూ ప్లస్ టూ ఆయిధాలతో కూడిన వ్యక్తిగత భధ్రత కల్పించాలని ఈసీని కోరాడు. ఎమ్ ఐఎమ్ పార్టీ కార్యకర్తల హింసా ప్రవృత్తి దృష్ట్యా నాంపల్లి నియోజకవర్గం మొత్తం కేంద్ర సాయుధదళాలను రంగంలోకి దింపాలని ఫిరోజ్ ఖాన్ కోరాడు. ``అన్ని పోలింగ్ బూతుల్లో సీసీ కెమెరాలు బిగించాలి. అన్ని కెమేరాలను ఒక ప్రత్యేక వెబ్‌పేజి నుంచి వెబ్ కాస్టింగ్ ద్వారా అందరూ వీక్షించే విధంగా లైవ్ స్ట్రీమింగ్ కోసం చర్యలు తీసుకోవాలి.. అలాగే బుర్ఖా వేసుకొని వచ్చే ప్రతి ఒక్కరినీ తప్పనిసరిగా గుర్తించే విధంగా ఏర్పాటు చేయాలి. మహిళా సాయిధ పోలీసులను అన్ని పోలింగ్ బూతుల్లోకి నియమించాలని బురఖా వేసుకొని వచ్చే మహిళా ఓటర్లను తనిఖీలు చేసి వారిని గుర్తించే విధంగా చర్యలు తీసుకోవాలి` అని ఫిరోజ్ ఈసీకి విన్నవించారు.
ముస్లిం అభ్యర్థియే తమ సామాజికవర్గానికి చెందిన వారి పట్ల సందేహం వ్యక్తం చేస్తూ ఈసీకి పిర్యాదు చేయడం, పైగా మైనార్టీలకు వేదికగా నిలుస్తుందనే పార్టీపై సంచలన ఆరోపణలు చేయడం ఆసక్తికరంగా మారింది. ఈసీ ఆయన ఫిర్యాదు ఎలా స్పందిస్తుందో చూడాలి మరి.