గత కొద్దికాలంగా జమ్మూకాశ్మీర్ లో పాకిస్థాన్ జెండాలు ఎగరవేస్తున్న అరాచకానికి తెరలేపుతున్న ఉగ్రవాద - పాకిస్థాన్ అనుకూల వర్గాలు ఇప్పుడు మరింతగా దిగజారి దారుణానికి తెగబడ్డాయి. భరతమాతకు దారుణ అవమానం చేస్తూ దేశ విద్రోహచర్యలకు తెరలేపాయి. పార్లమెంటుపై దాడి కేసు సూత్రధారి అఫ్జల్ గురుకు అనుకూలంగా బ్యానర్లు కట్టాయి.
‘అఫ్జల్ గురు మా హీరో...ధ్యాంక్యూ జెఎన్ యూ' అంటూ ఈ రోజు శ్రీనగర్ లో బ్యానర్లు వెలిశాయి. శ్రీనగర్ లో శుక్రవారం నాడు ఘర్షణలు కొత్త కాకపోయినా ఈ రోజు మాత్రం ఈ పోస్టర్లు, ఐఎస్ ఐఎస్, పాకిస్థాన్ జెండాల ప్రదర్శనలతో జరపడం మరింత ఆందోళనకు దారితీసింది. శుక్రవారం ప్రార్థనల అనంతరం ఒక గుంపు చేసిన హడావుడి తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది.
శ్రీనగర్ లోని జమా మసీదు వద్ద శుక్రవారం ప్రార్ధనలు ముగిసిన తరువాత ఒక గుంపు అప్జల్ గురు కు మద్దతుగా నినాదాలు చేస్తూ పాకిస్థాన్ - ఐఎస్ ఐఎస్ జెండాలను పట్టుకుని ఘర్షణలకు దిగింది. జమా మసీదు పరిసరాలలో అఫ్జల్ గురు మన హీరో, ధ్యాంక్యూ జెఎన్ యూ అంటూ బ్యానర్లు ధరించిన ఈ గుంపు భద్రతా దళాలపై రాళ్లతో దాడి చేసింది. దాదాపు 200 మంది ఉన్న ఈ గుంపు చేసిన దాడిలో ఇద్దరు పోలీసులు, ఎనిమిది మంది సాధారణ పౌరులు గాయపడ్డారు.