ప్రపంచంలో మరో వేర్పాటు పోరు సాగనుంది. మొన్నటి వరకు రష్యా, ఉక్రెయిన్ల మధ్య జరిగిన యుద్ధం ముగిసిపోకముందే ఇప్పుడు పాకిస్తాన్ దేశంలో కొత్త అలజడి మొదలైంది. పాకిస్తాన్ దేశంలో భాగమైన బలూచిస్తాన్ ప్రాంతం ప్రత్యేక దేశం కావాలని డిమాండ్లు తెరపైకి వస్తున్నాయి. అందుకు తీవ్ర ఆందోళనలు సాగుతున్నాయి. తమ ప్రాంతాన్ని ప్రత్యేక దేశంగా ప్రకటించాలని తిరుగుబాటు దారులు శిబిరాలను ఏర్పాటు చేసుకుంటున్నారు. అంతేకాకుండా ఈ ఉద్యమానికి భారత్ మద్దతు కావాలని అభిప్రాయపడుతున్నారు.
1948 మార్చి 27 న బలూచిస్తాన్ రాచరిక రాష్ట్రం పాకిస్తాన్ లో విలీనమైంది. సహజ వాయువు, మురు, బొగ్గు, రాగి సల్ఫర్, ఫ్లోరైడ్, బంగారం వంటి సహజ వనరులను కలిగి ఉన్న ఈ రాష్ట్రం పాకిస్తాన్ లో బాగా వెనుకబడిన రాష్ట్రం. పాకిస్తాన్ ప్రభుత్వం తమ ప్రాంతాన్ని పట్టించుకోవడం లేదని అప్పటి నుంచే ఉద్యమాలు సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రత్యేక దేశం కావాలని డిమాండ్లు సాగుతున్నాయి. 2013లో చైనా-పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ పాక్ ఆక్రమిత కాశ్మీర్ గుండా వెళ్లి గ్వాదర్ ఓడరేవులో కలుస్తున్నప్పుడు బలూచ్ జాతీయవాదులు ఈ అభివృద్ధి పనుల్లో తమకు ఎలాంటి వాటా లేదని అన్నారు.
అలాగే రెండు సంవత్సరాల కిందట బలూచ్ సముద్ర కార్మికుల చేపల వేట హక్కులను చైనా లాక్కోవడంతో సమస్య మరింత ముదిరింది. గత సంవత్సరం గ్వాదర్ కో హక్ దో తెహ్రీక్ నాయకుడు మౌలానా హిదయతుర్ రెహ్మాన్ మాట్లాడుతూ బలూచిస్తాన్ ప్రావిన్స్ ప్రజలకు చెందినవి వీటిని దోచుకోవాలంటే చూస్తూ ఊరుకోం అని హెచ్చరించారు. బలూచిస్తాన్ లో వంద కంటే ఎక్కువ ఖనిజాలున్నాయి. పాకిస్తాన్ గత కొన్నేళ్లుగా మా సంపదను దోచుకుంటుందని బూలూచిస్తాన్ లిబరేషన్ ఫ్రంట్ వ్యవస్థాపకుడు అల్లా నాజర్ అన్నారు.
బలూచిస్తాన్ ప్రత్యేక దేశ పోరులో భాగంగానే పాకిస్తాన్ రాజధాని కరాచీలో బుధవారం బాంబుల మోత మోగినట్లు తెలుస్తోంది. ఇక్కడ జరిగిన ఆత్మహుతి దాడిలో మహిళలు సహా నలుగురు ప్రాణాలు కోల్పోయారు. మరికొంతమంది గాయపడ్డారు.
ఒక వాహనంలో బాంబును అమర్చిన ముష్కరులు దానిని రిమోట్ కంట్రోల్ ద్వారా పేల్చివేసినట్లు సమాచారం. అయితే ఈ పేలుళ్లో చనిపోయింది చైనీయులే అని గుర్తించారు. చైనీయులే లక్ష్యంగా ఈ దాడి జరడంతో చైనా దేశం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఈ సంఘటనపై పాకిస్తాన్ ప్రభుత్వం సమగ్ర విచారణ చేయాలని డిమాండ్ చేస్తోంది.
అయితే బలూచిస్తాన్ ప్రత్యేక దేశం కోసం భారత్ మద్దతు ఇవ్వాలని అభిప్రాయపడుతోంది. పాక్ ఆక్రమిత కాశ్మీర్లో భారత్ సార్వ భౌమాధికార హక్కులను ఉల్లంఘిస్తూ సీపీఈసీని నిర్మిస్తున్నారు. కలాత్, ఖజ్దూర్, మస్తుంగ్ ప్రజలు ెక్కువగా బ్రాహుయి భాషను మాట్లాడుతారు. ఇది కన్నడ, మలయాళం, తమిళం బాషలకు అనుసంధానంగా ఉంటుంది. అంతేకాకుండా 2015 స్వాతంత్ర్య దినం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడి బలూచిస్తాన్ కు అనుకూలంగా వ్యాఖ్యలు చేశారు. దీంతో బూచిస్తాన్ వేర్పాటు వాదులు నరేంద్రమోడీ వ్యాఖ్యలను స్వాగతించారు.