మీ కక్కుర్తిలో కమండలం.. పెళ్లిలో అప్పడం కోసం కొట్టుకోవడం ఏంట్రా?

Update: 2022-09-03 01:30 GMT
పెళ్లంటే నూరేళ్ల పంట. దాన్ని వైభవంగా జరుపుతుంటారు. ఈ కాలంలో లక్షలు ఖర్చు పెట్టి మరీ ఈ తంతు నిర్వహిస్తున్నారు. అయితే పెళ్లి అంటే ఎన్నో ఇగోలతో జనాలు ఉంటారు. ఒక ముక్క తక్కువ వేసినా భోజనాల కాడ లొల్లిలు చేసే వారుంటారు. కట్నాలు, కానుకల వ్యవహారంలో  తేడా కొట్టి పెళ్లిలో తన్నుకుచచ్చేవారు ఎందరో..  కానీ ఇక్కడో పెళ్లిలో కేవలం ‘అప్పడం’ కోసం కొట్టుకున్నారు. ఎక్స్ ట్రా అప్పడం ఇవ్వలేదని పెళ్లిలో ముష్టియుద్ధం చేసుకున్నారు. ఈ ఫైటింగ్ ఓ రేంజ్ లో సాగింది. సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఒక అప్పడం కోసం ఏకంగా పెళ్లిలో వీర లెవల్లో జరిగిన ఫైటింగ్ ను ఎక్కడైనా చూశారా? చూడకపోతే ఇది చూసి ఎంజాయ్ చేయండి. కేరళ రాష్ట్రంలో జరిగిన ఒక పెళ్లిలో ఎక్స్ ట్రా అప్పడం కోసం జరిగిన ఈ ఫైటింగ్ చూసి అందరూ నోరెళ్లబెడుతున్నారు. ఒక అప్పడం కోసం ఇంతలా తన్నుకు చస్తారా? అని అందరూ షాక్ అవుతున్న పరిస్థితి నెలకొంది.

కేరళ రాష్ట్రంలోని అలప్పుజా జిల్లాలో ఒక పెళ్లిలో ఒక అప్పడం కారణంగా ఊహించనంత పెద్ద ఘర్షణ చోటుచేసుకుంది.  వరుడి స్నేహితులు ఎక్స్ ట్రా అప్పడం అడగగా.. ఇవ్వకుండా ఆడ పెళ్లి వారు వాటిని తిరస్కరించడంతో గొడవ జరిగింది. వాగ్వాదం ప్రారంభమైన తర్వాత అది క్రమంగా తీవ్రమైన కొట్లాటగా మారింది. ఇక ఈ వ్యవహారంలో పోలీసులు జోక్యం చేసుకునే సరికి అది ముష్టియుద్ధంగా మారింది.

ఆన్ లైన్ లో సర్క్యూలేట్ అవుతున్న ఒక వీడియో పూర్తిగా అప్పడం కోసం జరిగిన ముష్టి యుద్ధాన్ని మనకు చూపిస్తోంది. ఈ వీడియోలో వ్యక్తులు గుంపులుగా వీరంగం సృష్టించారు. ఒకరిపై ఒకరు పడి కొట్టుకోవడం.. తన్నుకోవడం.. వడ్డించడానికి వేసిన గిన్నెలు, బకెట్లను పారబోసి మరీ దాడులు చేసుకున్నారు. కుర్చీలు, బల్లలు ఒకరిపై ఒకరు విసురుకున్నారు.

100 శాతం అక్షరాస్యత ఉన్న గొప్ప రాష్ట్రమైన కేరళలో కేవలం అప్పడం కోసం జరిగిన ఘర్షణ చూసిన వారందరికీ షాక్ కు గురిచేసింది. ఇక ఈ ఘర్షణ ఉద్రిక్తంగా మారడంతో జోక్యం చేసుకున్న అలప్పుజా పోలీసులు 10మందిపై కేసు నమోదు చేశారు. ఘర్షణకు దిగిన వారిని అదుపులోకి తీసుకున్నారు.

అప్పడం గొడవ చూసినవారంతా అసలు ఇంతకీ పెళ్లి జరిగిందా? పెళ్లి కొంప కొల్లేరులా చేశారా? అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 100శాతం అక్షరాస్యత ఉన్న రాష్ట్రంలో ఇంతలా కొట్టుకోవడం ఏంటని కామెంట్ చేస్తున్నారు. అప్పడం కోసం కేరళ రాష్ట్రంలో పరువు తీస్తున్నారని మండిపడుతున్నారు..

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.


Full View
Tags:    

Similar News