కొన్ని సంఘటనలు ఒక్క సారి...స్వల్పకాలం పాటు జరగడమే ఆశ్చర్యం కలిగిస్తుంటాయి. అయితే...అలాంటి అరుదైన, ఆశ్చర్యకరమైన సంఘటనల్లో తారాస్థాయికి చేరిన సంఘటన ఇదే. అలాంటి షాకింగ్ సంఘటన ఇదే. ఒకవైపు ఒకటి కాదు రెండు కాదు..ఏడాది కాదు రెండేళ్లు కాదు..మూడేళ్లు కొబ్బరి చెట్టుపై ఉండిపోయాడు. అవును నిజంగానే కొబ్బరిచెట్టుపై ఉండిపోయాడు. పిలిప్పీన్స్ కు చెందిన ఓ వ్యక్తి విషయంలో అలాగే జరిగింది.
పిలిప్పిన్స్ లో జరిగిన ఓ ఘర్షణలో గిల్ బర్ట్ సాంఛేజ్ అనే వ్యక్తి తలపై ఎవరో తుపాకీతో కొట్టారు. దీంతో అతను అప్పటినుంచి తెలియని షాక్ కు గురయ్యాడు. ఈ ఘటన జరిగిన తర్వాత గిల్ బర్ట్ ఎవరో తనను చంపడానికి వస్తున్నారని - భయంతో వణికిపోతూ ఉన్నాడు. నేలపై ఉంటే ఎవరైనా వచ్చి తనను చంపేస్తారేమోనని భావించిన గిల్‌బర్ట్...ఇంటి పక్కనే తోటలో ఉన్న సుమారు 60 అడుగుల ఎత్తులో ఉన్న కొబ్బరిచెట్టుపైకి ఎక్కాడు. 2014లో కొబ్బరిచెట్టు ఎక్కిన గిల్ బర్ట్ అప్పటి నుంచి చెట్టుపైనే ఉండిపోయాడు. మూడేళ్లుగా కొబ్బరిచెట్టుపైన జీవితం గడుపుతున్న తన కొడుకును కిందకి దించేందుకు గిల్‌బర్ట్ తల్లి వినిఫ్రెదా సాంఛేజ్ ఎంత ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. చివరకు చేసేదేమి లేక తన కొడుకును బతికించేకునేందుకు కింద నుంచే దుస్తులు, ఆహారంతోపాటు అతనికిష్టమైన సిగరెట్లను కూడా ప్రత్యేకంగా తయారుచేసిన రోప్ వే సాయంతో పైకి పంపిస్తూ కాలం గడుపుతోంది.
ఒకవైపు ప్రాణభయం మరోవైపు ఆహారం అందుతున్న నేపథ్యంలో...గిల్‌బర్ట్ తన తల్లి పంపించిన ఆహారాన్ని తింటూ కొబ్బరిచెట్టును ఇంటిలా మార్చేసుకున్నాడు. గిల్ బర్ట్ ను సురక్షితంగా కిందికి దింపాలని అతని కూతుళ్లు - భార్య - తల్లి ఎన్నిసార్లు బతిమాలినా ఫలించలేదు. చివరగా ఈ ఏడాది అక్టోబర్ 11న 50 మంది సభ్యుల బృందం గిల్‌బర్ట్‌కు ఏమీ జరుగకుండా కొబ్బరిచెట్టుపై నుంచి ప్రాణాలతో దింపాలని నిర్ణయించుకున్నారు. వారంతా కలిసి మిషన్ సాయంతో చెట్టును నరికి..ఎట్టకేలకు గిల్ బర్ట్ ను సురక్షితంగా కాపాడారు. అయితే కిందికి వచ్చిన గిల్‌బర్ట్ చర్మంపై బొబ్బలు, పురుగుల కాట్లున్నాయి. కొబ్బరిచెట్టుపై పూర్తిగా వంగి కూర్చోవడం వల్ల అతని వెన్నెముక పూర్తిగా వంపు తిరిగి ఉన్నట్లుగా వైద్యులు గుర్తించారు. మూడేళ్ల తర్వాత ప్రాణాలతో సురక్షితంగా బయటపడిన గిల్‌బర్ట్, మానసికంగా మాత్రం చాలా కుదేలైన స్థితిలో ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. డాక్టర్లు గిల్ బర్ట్ ను ఆస్పత్రికి తరలించి చికిత్స కొనసాగిస్తున్నారు.