చిట్టి గుర్తుకొచ్చే రోబో తయారీ చివరి దశలో గూగుల్.. డీప్ మైండ్

Update: 2022-06-03 03:20 GMT
అప్పుడెప్పుడో వచ్చిన 'రోబో' మూవీ గుర్తుందా? అందులో చిట్టి అనే రోబో మనిషిలా ఆలోచించటమే కాదు.. దానికి మనిషి మాదిరే భావోద్వేగాలు వచ్చేయటం లాంటివి గుర్తున్నాయా? ఇప్పుడు సరిగ్గా అలాంటి ప్రయోగమే చివరి దశకు చేరుకున్నట్లుగా చెబుతున్నారు.

ఈ ప్రయోగం సక్సెస్ అయి.. మనిషి మాదిరి అన్ని పనులు చేయటంతో పాటు.. మనిషిలా ఆలోచించే శక్తి వచ్చేస్తే మానవ సమాన మేథోతనంతో పని చేసే రోబోలు వచ్చేయనున్నాయి. ఈ ప్రయోగం అనుకున్నట్లుగా పూర్తి అయితే.. మానవాళి గమనం మొత్తం మారిపోయే రోజులు మరెంతో దూరంలో లేవన్నట్లుగాతాజా ప్రయోగ ఫలితం ఉందని చెప్పాలి.

దీనికి సంబంధించి తాజాగా గూగుల్.. డీప్ మైండ్ సంస్థలు కీలక ప్రకటన చేసింది. 'గేమ్ ఓవర్. మానవ సమాన ఆర్టిఫిషియల్ అంటెలిజెన్స్ కు చేరువవుతున్నాం' అని ప్రకటించింది. అదే జరిగితే.. అధునాతన సాంకేతికతను అందిపుచ్చుకోవటానికి మరెంతో సమయం లేదనే చెప్పాలి. ఏజీఐపై అధ్యయనం చేస్తున్న శాస్త్రవేత్త.. ఆక్స్ ఫర్డ్ వర్సిటీ ప్రొఫెసర్ నాండో డీ ఫ్రెటాస్ వెల్లడించారు.

ఈ సాంకేతికతతోమనుషుల్లా ఆలోచించటమే కాదు.. వారు చేసే అన్ని పనులను ఇవి సులువుగా నేర్చుకోవటమే కాదు.. చేయగలవు కూడా. అన్నింటికి మించి మనుషుల మాదిరి ఆలోచించటం చేస్తాయి. మొత్తంగా ఎలాంటి ట్రైనింగ్ ఇవ్వకుండానే మనుషుల మాదిరి వ్యవహరించే ధోరణి ఈ రోబోలకు ఉంటుందని చెబుతున్నారు.

ఇటీవల డీప్ మైండ్ కంపెనీ తన ఏఐ ఏజెంట్ గాటోని ఆవిష్కరించింది. ఇది వేర్వేరుగా 604 పనులను సమర్థంగా చేయగలదని తెలిపింది.

గాటోలో సింగిల్ న్యూట్రల్ నెట్ వర్కుగా పిలిచే కంప్యూటింగ్ సిస్టం ఉంటుంది. ఇందులోని భాగాలు అంతర్గతంగా కనెక్టు అయి ఉంటాయని.. దీంతో మనిషి శరీరంలోని నరాల మాదిరి ఇవి చురుగ్గా పని చేస్తాయంటున్నారు. 1980 నాటి వీడియో గేమ్ లను   కూడా ఆడగలుగుతాయని చెబుతున్నారు. మొత్తానికి ప్రపంచ తీరు తెన్నులు మారిపోయే రోజులు మరెంతో సమయం పట్టదన్న మాట.
Tags:    

Similar News