ఏపీ అసెంబ్లీ.. మాజీ ముఖ్యమంత్రి దివంగత రోశయ్యకు నివాళులర్పించింది. ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్.. రోశయ్య ప్రజా జీవితాన్ని ప్రస్తావిస్తూ కొనియాడారు. అయితే, ఈ పని కొంత ఆలస్యంగా జరిగింది. వాస్తవానికి రోశయ్య.. జగన్ తండ్రి వైఎస్ కు ఆప్తులు. 2009లో వైఎస్ హఠాన్మరణంతో ఉమ్మడి రాష్ట్రానికి ఆయన సీఎం అయ్యారు. అయితే, తండ్రి దుర్మరణం తర్వాత సీఎం పీఠాన్ని జగన్ ఆశించారని అది దక్కకపోవడంతో రోశయ్యతో అంటీముట్టనట్లే ఉన్నారన్న వార్తలు వచ్చాయి. వీటిలో వాస్తవమెంతో తేలాల్సి ఉంది. అయితే, రోశయ్య తో జగన్ కు అంత హార్ధిక సంబంధాలు లేవనేది మాత్రం వాస్తవం.
కాగా, గతేడాది డిసెంబరు 4న రోశయ్య మరణించారు. ఏపీకి చెందినవారయిన రోశయ్యకు నివాళులర్పించేందుకు ఆ రాష్ట్ర సీఎం హోదాలో ఉన్న జగన్ హాజరు కాలేదు. ప్రత్యేక దూతలుగా మంత్రులను పంపారు. దీనిపై అప్పట్లోనే విమర్శలు వచ్చాయి. తాజాగా ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాల్లోనూ రోశయ్య కు నివాళి అర్పించకపోవడంపై విమర్శలు వచ్చాయి. ఇటీవల హఠాన్మరణం చెందిన మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డికి నివాళి అర్పించి రోశయ్యను విస్మరించడం వివాదంగా మారింది. ముఖ్యంగా ఆర్యవైశ్య సంఘాలు ఈ పరిణామాన్ని గమనించాయి. కొన్ని సోషల్ మీడియా సైట్లలోనూ ఇదే సంగతి ప్రస్తావనకు వచ్చింది. వీటన్నిటి నేపథ్యంలోనో ఏమో.. రోశయ్యకు అసెంబ్లీలో గురువారం ఏపీ ప్రభుత్వం నివాళి అర్పించింది.
రోశయ్య సహా పలువురు మాజీ ఎమ్మెల్యేలకు శాసనసభ సంతాపం తెలిపింది. మాజీ సభ్యుల మృతిపై సభలో సంతాప తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. తన తండ్రి రాజశేఖర రెడ్డితో రోశయ్యకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. విద్యార్థి నాయకుడి నుంచి సీఎం, గవర్నర్ వరకు వివిధ స్థాయుల్లో కొణిజేటి రోశయ్య ప్రజా జీవితంలో కొనసాగారని.. ఆయన ఏ బాధ్యత నిర్వర్తించినా అందరికీ ఆదర్శంగా నిలిచారని అన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఐదుగురు ముఖ్యమంత్రుల వద్ద రోశయ్య మంత్రిగా పనిచేశారని గుర్తుచేశారు. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలోనూ ఆర్థిక మంత్రిగా రోశయ్య కొనసాగారని.. వాళ్ల మధ్య చాలా మంచి సంబంధాలు ఉండేవని చెప్పారు. వైఎస్, రోశయ్య ఇద్దరూ మంచి స్నేహితులుగా ఉండేవారన్నారు.
అలాంటి రోశయ్య మన మధ్య లేకపోవడం బాధాకరమని.. ఆయన కుటుంబసభ్యులకు తన ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నట్లు జగన్ చెప్పారు. మృతిచెందిన మరికొంతమంది మాజీ ఎమ్మెల్యేలకు సంతాపం తెలుపుతున్నట్లు సీఎం చెప్పారు. వల్లూరి నారాయణమూర్తి, వీవీఎస్‌ఎస్ చౌదరి, కడప ప్రభాకర్‌రెడ్డి, మంగమూరి శ్రీధర కృష్ణారెడ్డి, గారపాటి సాంబశివరావు, టీఎన్ అనసూయమ్మ, పాటిల్ వేణుగోపాల్‌రెడ్డి, యల్లసిరి శ్రీనివాసులురెడ్డి, యడ్లపాటి వెంకట్రావు మృతికి సంతాపం తెలిపారు. అనంతరం స్పీకర్ తమ్మినేని సీతారాం సూచనతో శాసనసభలో సభ్యులు రెండు నిమిషాల మౌనం పాటించారు.
నష్ట నివారణకేనా?
ఏపీ సీఎం జగన్.. రోశయ్య సేవలను ఉద్దేశపూర్వకంగానే విస్మరిస్తున్నారన్న అభిప్రాయం కొన్ని వర్గాల్లో ఉంది. దీనిపై ఆయా వర్గాలు ప్రశ్నించకపోవడం కూడా నిలదీతకు కారణమవుతోంది. వాస్తవానికి కులమతాలకతీతంగా గౌరవించాల్సిన వ్యక్తి రోశయ్య. రాజకీయాల్లో ఎంతో హుందాతనం, వ్యక్తిగతంలో పరిణతితో ఆయన వ్యవహరించిన తీరు నేటి రాజకీయ నాయకులకు ఓ పాఠం. అంతేకాక, నీతి-నిజాయతీగా వ్యవహరించిన రోశయ్య తన పిల్లలను రాజకీయాల్లోకి తేలేదు. అలాంటి నాయకుడి పట్ల సొంత రాష్ట్ర ప్రభుత్వమే ఉదాసీనంగా వ్యవహరిస్తున్న తీరును చాలామంది తప్పుబట్టారు.
పొరుగు రాష్ట్రం తెలంగాణ గౌరవించిన పాటి కూడా ఏపీ గౌరవించకపోవడాన్ని గుర్తుచేస్తున్నారు. అన్నిటికి మించి రోశయ్య మరణానికి అసెంబ్లీలో సంతాపం తెలపకపోవడం చర్చనీయాంశమైంది. దీనికితోడు కొన్ని నెలల క్రితం ప్రకాశం జిల్లా వైశ్య నాయకుడిపై చోటుచేసుకున్న దాడి సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో వైసీపీ ప్రభుత్వం దిగివచ్చి.. రోశయ్యకు అసెంబ్లీలో సంతాపం తెలిపింది.