జైట్లీకి ర‌క్ష‌ణ శాఖ‌...మంత్రివ‌ర్గంలో మార్పులు

Update: 2017-03-13 13:36 GMT
గోవా ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయనున్న నేప‌థ్యంలో ప్ర‌స్తుత ర‌క్ష‌ణ శాఖా మనోహర్ పారికర్ రాజీనామా చేశారు. పారికర్ రాజీనామాను రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆమోదించారు. కేంద్ర రక్షణ శాఖ బాధ్యతలను ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీకి అప్పగించారు. ఇంతవరకు ఈ శాఖ బాధ్యతలు చూసిన ప‌రిక‌ర్ ప‌ద‌వి వీడడంతో తాత్కాలికంగా రక్షణ శాఖ అదనపు బాధ్యతలను అరుణ్ జైట్లీ మోయనున్నారు.

ఇదిలాఉండ‌గా...పార్లమెంట్ సమావేశాలు ముగిసిన తర్వాత కేబినెట్ లో కీలక మార్పులు జరగనున్నట్లు వార్తలు వస్తున్నాయి. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీకి రక్షణ శాఖ అదనపు బాధ్యతలు అప్పగించిన నేప‌థ్యంలో ఇదే అదనుగా త్వరలో కేబినెట్‌ లో కీల‌క మార్పులు చేసే అవ‌కాశాలు కూడా క‌నిపిస్తున్నాయి. కేంద్ర కేబినెట్‌ లో మార్పులు త‌ప్ప‌క‌పోవ‌చ్చ‌ని ప్ర‌భుత్వ వ‌ర్గాలు స్ప‌ష్టం చేస్తున్నాయి. బీజేపీ ముఖ్య‌మంత్రుల్లో క‌నీసం ఒక్కరికైనా కేంద్ర కేబినెట్‌ లోకి తీసుకోవ‌చ్చ‌ని స‌మాచారం. ఆ సీఎం స్థానాన్ని బీజేపీ కేంద్ర వ‌ర్గంలోని సీనియ‌ర్ ప్ర‌ధాని కార్య‌ద‌ర్శితో భ‌ర్తీ చేయొచ్చ‌నీ వార్త‌లు వ‌స్తున్నాయి.

ప్ర‌స్తుతానికైతే జైట్లీకి అదనపు బాధ్యతలు అప్పగించినప్ప‌టికీ పార్ల‌మెంట్ బ‌డ్జెట్ స‌మావేశాలు ముగియ‌గానే.. కేబినెట్‌ లో భారీ మార్పులు త‌ప్ప‌క‌పోవ‌చ్చు అని ప్ర‌భుత్వ వ‌ర్గాలు వెల్ల‌డించాయి. యూపీలో విజ‌యంతో పార్టీ, ప్ర‌భుత్వంపై ప్ర‌దాన‌మంత్రి న‌రేంద్ర మోడీ ప‌ట్టు మ‌రింత పెరిగింది. దీంతో ఓ రాష్ట్ర సీఎంను కేబినెట్‌ లోకి తీసుకున్నా ఎవ‌రూ వ్య‌తిరేకించ‌క‌పోవ‌చ్చు అని బీజేపీలోని చ‌ర్చ సాగుతోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News