విన్న‌పాలు విన‌వ‌లె.. మ‌ళ్లీ బుగ్గ‌న ఢిల్లీ బాట‌!

Update: 2023-02-11 19:18 GMT
ఏపీ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గ‌న రాజేంద్ర నాథ్‌రెడ్డి మ‌ళ్లీ ఢిల్లీ బాట ప‌ట్టారు. త్వ‌ర‌లోనే ఏపీ 2023-24 వార్షిక బ‌డ్జెట్‌ను ప్ర‌వేశ పెట్ట‌ను న్న నేప‌థ్యంలో ఆర్థిక మంత్రి ఢిల్లీ ప‌ర్య‌ట‌న ఆస‌క్తిగా మారింది.ఈ ద‌ఫా కేంద్రంలోని ఆర్థిక శాఖ మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ తో పాటు ప‌లువురు ఇత‌ర మంత్రుల‌ను కూడా బుగ్గ‌న క‌లుసుకున్నారు.

అయితే.. ఈ ద‌ఫా కూడా ఆయ‌న ఏపీకి అప్పుల‌కు సం బంధించే అభ్య‌ర్థించేందుకు ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌కు వెళ్లార‌ని ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీ నాయ‌కులు విమ‌ర్శిస్తున్నారు. బ‌డ్జెట్‌లో అప్పుల ప్ర‌స్తావ‌న తీసుకురావ‌డం త‌ప్ప‌ద‌ని.. అందుకే.. దీనిని స‌మ‌ర్థించుకునేందుకు ఆయ‌న ఢిల్లీ వెళ్లి ఉంటార‌ని అంటున్నారు.

మ‌రోవైపు, ఏపీ ఆర్థిక శాఖ మాత్రం దీనికి భిన్న‌మైన ప్ర‌క‌ట‌న జారీ చేసింది. ఈ ద‌ఫా రాష్ట్రంలో చేప‌డుతున్న కేంద్ర ప్రాజెక్టుల‌కు సంబంధించి తాజాగా ప్ర‌వేశ పెట్టిన బ‌డ్జెట్‌లో కేటాయింపుల‌పై చ‌ర్చించేందుకు ఆయ‌న ఢిల్లీ వెళ్లార‌ని అంటున్నారు.

అయితే.. ఆయా ప్రాజెక్టుల‌కు ఇప్ప‌టికే కేంద్రం నిధులు కేటాయించిన నేప‌థ్యంలో మ‌రోసారి స‌వ‌ర‌ణ బ‌డ్జెట్‌లో ప్ర‌తిపాద‌న‌లు పెంచేందుకు బుగ్గ‌న ప్ర‌య‌త్నిస్తున్నారని వైసీపీ నేత‌లు కూడా చెబుతున్నారు. కానీ, టీడీపీ నాయ‌కులు మాత్రం మ‌రోసారి అప్పుల‌కు అనుమ‌తి కోస‌మే ఆయ‌న ఆర్థిక మంత్రిని క‌లిశార‌ని ఆరోపిస్తున్నారు.

ఇవ‌న్నీ ఇలా ఉంటే.. ప్ర‌స్తుత ఆర్థిక సంవ‌త్స‌రంలో ఏపీకి కేంద్రం ఇచ్చిన అప్పుల ప‌రిమితి దాటి పోయింది. అయితే.. మ‌రో నెల‌రోజుల పాటు.. రాష్ట్రం గ‌డ‌వాల్సిన అవ‌స‌రం ఉంది. ముఖ్యంగా జ‌న‌వ‌రి నెల జీతాలను ఫిబ్ర‌వ‌రి 10వ తేదీ దాటిపోయినా.. ఇవ్వ‌లేదు.

ఇక‌, ఇత‌ర పెండింగు బిల్లుల‌ను కూడా చెల్లించాల్సి ఉంది. ఈ నేప‌థ్యంలో వ‌చ్చే మంగ‌ళ‌వారం(14వ తేదీ) రిజ‌ర్వ్ బ్యాంకు వేసే వేలంలో మ‌రిన్ని అప్పులు కోరేందుకు బుగ్గ‌న వెళ్లి ఉంటార‌ని ప‌రిశీల‌కులు కూడా భావిస్తున్నారు. ఈ అప్పులు తీసుకువ‌చ్చి ఉద్యోగుల‌కు వేత‌నాలు స‌ర్దుబాటు చేస్తారేమోన‌ని సందేహాలు వ్య‌క్తం చేస్తున్నాయి. ఏదేమైనా.. బుగ్గ‌న ఢిల్లీ ప‌ర్య‌ట‌న మ‌రోసారి చ‌ర్చ‌కు వ‌చ్చింది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.

Similar News