తిట్టే నోరు.. తిరిగే కాలు ఊరికే ఉండదంటూ చెప్పే సామెతకు మరో మాటను యాడ్ చేయాల్సిందే. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తీరు చూస్తే.. తిట్టే నోరు.. తిరిగే కాలు.. వివాదాల కేజ్రీవాల్ అన్న మాటను చేర్చాల్సిందే. వివాదాస్పద వ్యాఖ్యలు చేయటమే కాదు.. అందుకు వివరణ అడిగిన కేంద్ర ఎన్నికల సంఘానికి చిరాకు పుట్టించేలా చేయటంతో ఢిల్లీ ముఖ్యమంత్రి తర్వాతే ఎవరైనా. తాజాగా జరుగుతున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో గోవాలో జరిగిన ఎన్నికల ప్రచారానికి వెళ్లిన కేజ్రీవాల్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
గోవా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కేజ్రీవాల్ మాట్లాడుతూ.. ప్రత్యర్థి పార్టీలు డబ్బులిస్తే తీసుకోవాలని.. ఓటు మాత్రం ఆమ్ ఆద్మీ పార్టీకే వేయాలని సూచించారు. దీనిపై కాంగ్రెస్ చేసిన ఫిర్యాదుతో వివరణ ఇవ్వాలంటూ కేజ్రీవాల్ కు కేంద్ర ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది. అయితే.. కేజ్రీవాల్ ఈసీకి వివరణ ఇచ్చే బదులు.. కోర్టును ఆశ్రయించారు. ఈసీ ఇచ్చిన నోటీసులు సరికావని వాదించారు. దీనిపై ఈసీ తాజాగా మరోసారి సీరియస్ అయ్యింది.
ఎన్నికల నియమావళిని ఉల్లంఘించటమే కాదు.. తాము చేసిన హెచ్చరికల్నిఖాతరు చేయకపోవటంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఢిల్లీ ముఖ్యమంత్రిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలంటూ ఈ రోజు (ఆదివారం) ఆదేశాలుజారీ చేసింది. కేజ్రీవాల్ పై కేసు పెట్టి.. ఆ ఎఫ్ ఐఆర్ కాపీని జనవరి 31వ తేదీ సాయంత్రం 5 గంటల లోపు పంపాలని పేర్కొంది. గోవా ఎన్నికలు ఫిబ్రవరి 4న జరగనున్నాయి. మరి.. పోలింగ్ తేదీ దగ్గరకొచ్చిన వేళ కేంద్ర ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయం కేజ్రీవాల్ కు ఎలాంటి చిక్కులు తెచ్చి పెడుతుందన్నది ఆసక్తికరంగా మారింది. ఏమైనా.. నోరు జారి మాట్లాడటం.. వివాదాలతో సహజీవనం చేసే ఢిల్లీ సీఎంకు తాజా పరిణామంతో తిప్పలు తప్పవన్న వాదన వినిపిస్తోంది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/