రాజకీయం అంటే క్రికెట్ ఆడినంత ఈజీ కాదు. అలాగే సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినంత సులభమూ కాదు.. బహుశా ఇదే విషయం భారత క్రికెట్ జట్టు మాజీ సభ్యుడు - ప్రస్తుత బీజేపీ ఎంపీ అభ్యర్థుల్లో ఒకరైన గౌతమ్ గంభీర్ కు అర్థమై ఉండాలి.
ఇటీవలే బీజేపీలో చేరిన గౌతమ్ గంభీర్ ఢిల్లీలోని ఒక ఎంపీ సీటు నుంచి అభ్యర్థిగా పోటీలో ఉన్న సంగతి తెలిసిందే. క్రికెట్ నుంచి రిటైరయ్యాకా గంభీర్ కొన్ని జాతీయవాద ట్వీట్లు పెట్టారు. అప్పుడే ఈయన రాజకీయాల్లోకి వస్తారని - అది కూడా బీజేపీలోకి చేరబోతున్నారనే ఊహాగానాలు ఏర్పడ్డాయి. అప్పటిలో అదేం లేదన్న గంభీర్.. చివరకు అదే పనే చేశాడు. ఇప్పుడు ఢిల్లీ నుంచి బీజేపీ తరఫున పోటీలో ఉన్నాడీయన.
ఆ సంగతలా ఉంటే.. ఇప్పుడు గంభీర్ పై వరసగా ఫిర్యాదులు నమోదవుతున్నాయి. గంభీర్ రెండు చోట్ల ఓటు హక్కును కలిగి ఉన్నాడట. ఈ విషయంపై ఆప్ ఫిర్యాదు చేసింది. ఢిల్లీలో ఆప్ గట్టిగా తలపడుతున్న సంగతి తెలిసిందే.
ఇక తాజాగా మరో కేసు కూడా నమోదైంది ఈ క్రికెటర్ మీద. అనుమతి లేకుండా ఒక ర్యాలీని నిర్వహించడంపై ఎన్నికల కమిషన్ గంభీర్ మీద కేసుకు ఆదేశించింది. ఇలా వరసగా కేసుల్లో బుక్ అవుతున్నాడు ఈ మాజీ క్రికెటర్. బహుశా గంభీర్ కు అసలు సిసలు రాజకీయం అంటే ఏమిటో ఇప్పుడిప్పుడే అర్థం అవుతూ ఉండవచ్చు!