కాంగ్రెస్‌లోకి రేవంత్ రాక‌ను ఆ ఫైర్‌బ్రాండ్ అడ్డుకుంటోంద‌ట‌

Update: 2017-10-15 17:40 GMT
తెలంగాణ రాజ‌కీయాల్లో త‌న‌దైన శైలిలో ఫైర్‌బ్రాండ్‌గా వ్య‌వ‌హ‌రించే టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారా? ఆయన చేరికకు రంగం సిద్ధమైందా? అయితే ఆయ‌న త‌ర‌హాలోనే ఫైర్ బ్రాండ్ లీడ‌ర్ అనే పేరున్న మ‌రో నేత‌ రేవంత్ చేరిక‌ను అడ్డుకుంటున్నారా? అంటే అవున‌నే స‌మాధానం వ‌స్తోంది. కొద్దికాలంగా తెలుగుదేశం పార్టీలో రేవంత్ రెడ్డికి అనుకూల ప‌రిస్థితులు లేవ‌న్న వాద‌న‌లు, మ‌రోవైపు పార్టీలో బ‌లోపేతంపై న‌మ్మ‌కం స‌డ‌లిన నేప‌థ్యంలో ఆయ‌న కాంగ్రెస్ పార్టీలో చేర‌నున్న‌ట్లువార్త‌లు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. ఇటీవ‌ల పీసీసీ మీటింగ్‌లో రేవంత్ చేరికపై హాట్ హాట్ చర్చ జరిగినట్టు తెలుస్తోంది.

టీపీసీసీ స‌మావేశంలో రేవంత్ చేరిక గురించి ప్ర‌ధానంగా ప్ర‌స్తావ‌న‌కు వ‌చ్చింది. అయితే రేవంత్ రెడ్డి చేరిక‌ను కాంగ్రెస్ సీనియ‌ర్ ఎమ్మెల్యే డీకే అరుణ తీవ్రంగా ప్ర‌తిఘ‌టించిన‌ట్లు స‌మాచారం.  స్థానిక నేతల అనుమతి లేకుండా పార్టీలో ఎవరినీ చేర్చుకోవద్దని కాంగ్రెస్ సీనియర్ నేతగా త‌న అభిప్రాయ‌మ‌ని డీకే అరుణ స్ప‌ష్టం చేసిన‌ట్లు తెలుస్తోంది. నేరుగా రేవంత్ పేరు ప్రస్తావించకపోయినా ఇతర నేతలను పార్టీలో చేర్చుకునే ముందు స్థానిక నేతలను సంప్రదించాలని ఆమె వాదించారని తెలుస్తోంది. అసలు కాంగ్రెస్‌ను వ్యతిరేకించే రేవంత్‌ను ఎలా పార్టీలో చేర్చుకుంటారంటూ మరికొందరు ప్రశ్నించినట్టు సమాచారం. అసలు రేవంత్ వస్తానన్నాడా? మీరే రమ్మంటున్నారా?  అని టీపీసీసీ పెద్ద‌ల‌ను కూడా కొంద‌రు నేతలు నిలదీశార‌ని తెలుస్తోంది. దీంతో కాంగ్రెస్‌లోని కొంద‌రు నేత‌లు త‌మ‌కు వ‌చ్చిన ప్ర‌తిపాద‌న‌నే చ‌ర్చ‌లో పెట్టామ‌ని వివ‌రించిన‌ట్లు తెలుస్తోంది

అత్యంత ఆస‌క్తికరంగా ప్రభుత్వంపై పోరాటాలకు కార్యాచరణ సిద్ధం చేయడానికి ఏర్పాటు చేసిన సీఎల్పీ మీటింగ్‌లో రేవంత్‌రెడ్డి హాట్ టాఫిక్ అయినట్టు సమాచారం. తెలంగాణలో కాంగ్రెస్, టీడీపీ పొత్తు పెట్టుకుంటాయని కొంత కాలంగా చర్చ జరుగుతున్న క్ర‌మంలో రేవంత్ కాంగ్రెస్‌లో చేరడంపై ఆ పార్టీ నేత‌ల మ‌ధ్య విబేధాలు పొడ‌చూప‌డం ఆస‌క్తికంర‌గా మారింది.
Tags:    

Similar News