ఫెసిలిటీ ఏస్’ అనే పెద్ద నౌకలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. భారీ ఎత్తున మంటలు చెలరేగాయి. అందులో ఉన్న 22 మంది సిబ్బందిని సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. ఆ నౌకలో పోర్షే, బెంట్లీ, ఆడీ, లాంబోర్గిని వంటి 3965 విలాసవంతమైన కార్లు ఉన్నట్టు సమాచారం.
అట్లాంటిక్ మహాసముద్రం మధ్యలో అజోర్స్ ద్వీపాలకు కొద్ది దూరంలో బుధవారం మధ్యాహ్నం ఈ ఘటన చోటుచేసుకున్నట్లు అధికారులు తెలిపారు. సమాచారం అందిన వెంటనే ఆ ప్రాంతానికి సమీపంలో ఉండే పోర్చుగీసు నావికా, వాయుసేన సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. సిబ్బందిని సురక్షితంగా ఓ హోటల్ కు తరలించారు.
ప్రస్తుతం ఫెసిలిటీ ఏస్ సముద్రం మధ్యలో ఓ విగతజీవిలా తేలుతూ ఉంది. మంటలు ఆర్పి నౌకను ఒడ్డుకు చేర్చేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. జర్మనీలోని వోల్ఫ్స్ బర్గ్ లో ఉన్న ఫోక్స్ వ్యాగన్ గ్రూప్ నకు చెందిన ఓ తయారీ కేంద్రంలో పోర్షే, ఆడీ, లాంబోర్గినీ సహా ఫోక్స్ వ్యాగన్ వాహనాలు ఉత్పత్తి అవుతున్నాయి. సమీపంలో ఉన్న ఎండెన్ పోర్టు నుంచి వాటిని అమెరికాలోని డావిస్ విల్లే పోర్టుకు తరలించేందుకు నౌక బయలు దేరగా.. మధ్యలో ఈ ప్రమాదం జరిగింది.
ఈ భారీ నౌకలో 1100 పోర్షే కార్లు ఉన్నట్టు సమాచారం. అవి అందాల్సిన వినియోగదారులకు డీలర్ల ద్వారా సమాచారాన్ని చేరవేసినట్లు పేర్కొన్నారు. పోర్షే కార్లు గతంలోనూ ఓసారి సముద్రంలో మునిగిపోయాయి. గ్రాండే అమెరికా అనే భారీ నౌక 2019లో మంటలు అంటుకొని మునిగిపోయింది. దాంతో పాటే అందులో ఉన్న ఆడీ,పోర్షే కార్లూ మునిగిపోయాయి. లాంబోర్గిని వర్గాలు మాత్రం తాజా ఘటనపై స్పందించడానికి నిరాకరించాయి.
ఫెసిలీటీ ఏస్ పరిణామం దాదాపు మూడు ఫుట్ బాల్ స్టేడియాలకు సమానంగా ఉంటుంది. నౌకను ఒడ్డుకు చేర్చేందుకు కావాల్సిన ఏర్పాట్లు చురుకుగా సాగుతున్నట్లు పోర్చుగీసు నేవి తెలిపింది. ఇప్పటివరకైతే నౌక వల్ల ఎలాంటి కాలుష్యం జరగలేదని అధికారులు వెల్లడించారు.