ఒకటి కాదు రెండు కాదు ఏకంగా వంద గ్యాస్ సిలిండర్లు. ఒకటి తర్వాత ఒకటి చొప్పున పేలిపోతే పరిస్థితి ఎలా ఉంటుంది? ఆ దగ్గర్లోని గ్రామాల్లోని వారి పరిస్థితి ఏంటి? వినేందుకు వణుకు పుట్టించే ఈ ఉదంతం.. చోటు చేసుకున్న గ్రామస్థుల పరిస్థితి ఏంటి? ఎంతలా భయపడి ఉంటారో ఇట్టే అర్థం చేసుకోవచ్చు.
అగ్నిప్రమాదాలు జరిగినప్పుడు వచ్చే అగ్నిమాపక శాఖ సైతం ఏం చేయాలో తోచక.. భయాందోళనలకు గురైన ఉదంతం ప్రకాశం జిల్లాలో చోటు చేసుకుంది. అసలేం జరిగిందంటే..
అనూహ్య ఘటన ఒకటి ప్రకాశం జిల్లా దద్దవాడ గ్రామంలో చోటు చేసుకుంది. ఈ ప్రమాదానికి బిక్కచచ్చిపోయిన ప్రజలు.. భయంతో వణికిపోయారు. గ్యాస్ సిలిండర్ల లోడ్ తో వెళుతున్న లారీ ఇంజిన్ లో అనూహ్యంగా మంటలు రేగాయి. చాలా వేగంగా ఆ మంటలు లారీని చుట్టు ముట్టేశాయి. దీంతో ఒకటి తర్వాత ఒకటి చొప్పున గ్యాస్ సిలిండర్లు పేలిపోవటం.. ఆ మోతలకు దద్దవాడ గ్రామస్థులకు గుండెళ్లో రైళ్లు పరిగెత్తాయి.
కర్నూలు నుంచి నెల్లూరు జిల్లా ఉలవపాడుకు గ్యాస్ సిలిండర్ల లోడ్ వెళుతోంది. ఆ లారీలో మంటలు చెలరేగటం.. పెద్ద ఎత్తున కమ్మేసిన మంటలతో గ్యాస్ సిలిండర్లు ఒక్కొక్కటి పేలి.. భయానక శబ్ధంతో అక్కడి పరిసరాలు దద్దరిల్లాయి.
అర్థరాత్రి వేళలో చోటు చేసుకున్న ఈ ఉదంతం అక్కడి స్థానికులకు ఏం జరిగిందో అర్థం కాక భయంతో వణికిపోయారు.
ఈ ఉదంతంలో వందకు పైగా గ్యాస్ సిలిండర్లు పేలినట్లుగా అంచనా వేస్తున్నారు. అగ్ని ప్రమాదం గురించి సమాచారం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది.. రావటమైతే వచ్చారే కానీ.. ఏం చేయాలో పాలుపోక.. ప్రమాద స్థలికి దూరంగా ఉండిపోయారు. ఈ ఘోర ప్రమాదం నుంచి లారీ డ్రైవర్ సురక్షితంగా బయటపడ్డాడు. మంటల్ని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నించిన ఫైర్ సిబ్బంది.. సాధ్యం కాక ఉండిపోయారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.