అరవింద్ స్వామి కంపెనీలో ఫైర్ యాక్సిడెంట్

Update: 2016-03-02 04:43 GMT
అప్పుడెప్పుడో వచ్చిన రోజా సినిమా గుర్తుందా? ఇప్పటి తరానికి కాస్త పాత సినిమా అయినా.. సూపర్ హిట్ అయిన ఆ సినిమాను చూసే ఛాన్స్ ఎక్కువనే చెప్పాలి. ఆ సినిమా హీరో.. ఆరడుగుల అందగాడు.. మన్మదుడు లాంటి అరవింద్ స్వామి గుర్తుకు వచ్చాడా? ఆయనకు సంబంధించిన వార్త ఒకటి మీడియాలో ప్రముఖంగా కనిపిస్తోంది. సినిమా నటుడిగా ఎక్కువ మందికి సుపరిచితుడైన ఆయనకు.. ఒక ఐటీ కంపెనీ ఉంది.

సదరుకంపెనీలో తాజాగా ఫైర్ యాక్సిడెంట్ కావటం ఇప్పుడు అందరినోట అరవింద్ స్వామి నానుతున్నారు. చెన్నైలోని అళ్వార్ పేట సీపీ రామసామి రోడ్డులో అరవింద్ స్వామికి ఒక ఐటీ కంపెనీ ఉంది. మూడంస్తుల భవనంలో రెండో అంతస్తులో ఈ కంపెనీ కార్యాలయం ఉంది. మంగళవారం ఉదయం ఈ సంస్థలో హటాత్తుగా పొగలు బయటకు రావటంతో అలెర్ట్ అయిన వాచ్ మెన్ వెంటనే ఫైర్ డిపార్ట్ మెంట్ కు ఫోన్ చేశారు.

హుటాహుటిన చేరుకున్న వారు.. మంటల్ని అదుపులోకి తెచ్చారు. ఈ కంపెనీ కార్యాలయం ఎవరిదన్న విషయాన్ని చెక్ చేయగా అది తమిళ.. తెలుగు నటుడు అరవింద్ స్వామికి చెందిన ఐటీ కంపెనీగా తేలింది. ఈ ఫైర్ యాక్సిడెంట్ లో వందకుపైగా కంప్యూటర్లు.. ఫర్నీచర్ మొత్తం దగ్థమైంది. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం చోటు చేసుకుందని భావిస్తున్నారు. మొత్తానికి హీరోకి సినిమా కష్టం వచ్చినట్లుందే.
Tags:    

Similar News