ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ లో చిన్నపాటి అగ్ని ప్రమాదం సంభవించింది. రాష్ట్రపతి భవన్ లోని అకౌంట్స్ విభాగంలో మంటలు చెలరేగడంతో, అక్కడ పని చేస్తున్న సిబ్బంది ఆందోళనకు గురయ్యారు. వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. హుటాహుటీన అక్కడకు చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
ప్రమాదం కచ్చితంగా ఎన్ని గంటలకు జరిగిందన్నది తెలియకపోయినా ఢిల్లీలోని ఫైర్ డిపార్టుమెంటుకు మాత్రం ఉదయం 8.45కి ఫోన్ వచ్చింది. రాష్ర్టపతి భవన్ అకౌంట్సు విభాగంలో మంటలు చెలరేగాయన్నది దాని సారాంశం. దాంతో వెంటనే అగ్నిమాపక సిబ్బంది అక్కడకు నిమిషాల్లో చేరుకున్నారు. ఆరుగురు సిబ్బంది 10 నిమిషాల్లో మంటలను ఆపేశారు.
ఈ ప్రమాదం షార్ట్ సర్య్కూట్ వల్ల ప్రమాదం జరిగిందా లేక వేరే కారణాలు ఉన్నాయా అనే కోణంలో అధికారులు విచారణ చేస్తున్నారు. కాగా కొద్దిరోజుల కిందటే పార్లమెంటు హౌస్ లోనూ బడ్జెట్ సమావేశాలకు ముందు స్వల్ప అగ్నిప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/