కేసీఆర్ హెలికాప్టర్ కు తప్పిన ప్రమాదం

Update: 2018-02-27 15:24 GMT
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ కు ప్రమాదం తప్పింది. ఆదిలాబాద్ పర్యటనకు వెళ్లేందుకు ఆయన బయలుదేరిన హెలికాప్టర్‌ లోని ఓ విహెచ్ ఎఫ్ కమ్యూనికేషన్ సెట్‌ ఉన్న బ్యాగు నుంచి ఉదయం 10.30 గంటల ప్రాంతంలో పొగ రావడాన్ని గుర్తించారు. వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది ఆ బ్యాగును చాకచక్యంగా బయట పడేశారు.
    
కాగా ఈ ఘటన అనంతరం సీఎం హెలికాప్టరుకు ప్రమాదం జరిగిందంటూ ఒక్కాసారిగా సోషల్ మీడియాలో రావడంతో ఆయన అభిమానులు - రాష్ట్రప్రజల్లో ఆందోళన ఏర్పడింది. అయితే... ఆయన కుమారుడు - రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ట్విట్టర్‌ లో స్పందించారు. ఇదే విషయాన్ని ముఖ్యమంత్రి కార్యాలయాన్ని తాను ఫోన్‌ లో సంప్రదించానని - సీఎంకి ఎలాంటి ప్రమాదం జరగలేదని ఆయన చెప్పారు. సీఎం తన ఆదిలాబాద్ పర్యటనను కొనసాగిస్తారని కేటీఆర్ తెలిపారు.
    
అన్నట్లుగానే కేసీఆర్ ఆ తరువాత  ఆదిలాబాద్ వెళ్లారు. మంచిర్యాల నస్పూర్‌ కు చేరుకున్నారు. అనంతరం నస్పూర్‌ లో జిల్లా సమీకృత భవన నిర్మాణ సదుపాయానికి సీఎం కేసీఆర్‌ శంకుస్థాపన చేశారు. అనంతరం శ్రీరాంపూర్‌ లో పర్యటించిన సీఎం కేసీఆర్‌ ఆరు భూగర్భ గనులకు శంకుస్థాపన చేశారు. శ్రీరాంపూర్‌ లో సింగరేణి కార్మికులతో ఆయన సమావేశమవుతారు.
Tags:    

Similar News