దేశ రాజధాని ఢిల్లీలో కాల్పులు కలకలం రేపాయి. ఓ పోలీస్ విచక్షణ మరిచి తన తోటి పోలీసులపై కాల్పులకు తెగబడ్డాడు. ఈ దారుణం అందరినీ షాక్ కు గురిచేసింది. ఓ పోలీస్ తన సహోద్యోగులపై కాల్పులు జరపడంతో ముగ్గురు అందులో మృతిచెందారు. సోమవారం జరిగిన ఈ ఘటనలో పోలీస్ శాఖలో విషాదం నింపింది.
రోహిణి ప్రాంతంలోని హైదర్ పూర్ వాటర్ ట్రీట్ మెంట్ ప్లాంట్లో సిక్కిం రాష్ట్రానికి చెందిన పోలీసులు విధులు నిర్వహిస్తున్నారు. వీరి మధ్య జరిగిన గొడవ కారణంగా ఓ సిక్కిం పోలీస్ (32) తోటి సిబ్బందిపై తుపాకీతో కాల్పులు జరిపాడు. ఈ ప్రమాదంలో ఇద్దరు పోలీసులు ఘటనా స్థలంలోనే మరణించారు.
కాల్పుల్లో మరణించిన వారిని కమాండర్ పింటో నామ్ గ్యాల్ భూటియా, ఇంద్ర లాల్ చెత్రీ గా పోలీసులు గుర్తించారు. దన్ హంగ్ సుబ్బాకు తీవ్ర గాయాలు కాగా అంబేద్కర్ ఆస్పత్రిలో చేర్చారు. చికిత్స పొందుతూ ఆయన కూడా మరణించినట్టు వైద్యులు తెలిపారు.
ఇక కాల్పులు జరిపిన నిందితుడు ప్రబిన్ రాయ్ గా ఢిల్లీ పోలీసులు గుర్తించారు. ఇతడు కూడా పోలీస్ నే. అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. రాయ్ ఇండియన్ రిజర్వ్ బెటాలియన్స్, సిక్కిం పోలీస్ కు చెందిన వాడు. రాయ్, భూటియా 2012 బ్యాచ్ నుంచి గ్రాడ్యూయేషన్ పూర్తి చేశారు. సుబ్బా, చైత్రీ 2013 బ్యాచ్ కు చెందినవారు.
కాగా.. జమ్మూకశ్మీర్ లోనూ ఇటీవల ఇలాంటి ఘటన చోటుచేసుకుంది. ఉదంపూర్ జిల్లాలో ఇండో టిబెటిన్ బోర్డర్ పోలీసు జవాన్ శనివారం తన ముగ్గురు సహచరులపై తుపాకీతో కాల్పులు జరిపాడు. వారు గాయపడ్డారు. తర్వాత తనను తాను కాల్చుకొని చనిపోయాడు.