ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా పీచమణిచే టీకా గత ఏడాది డిసెంబరులో అందుబాటులోకి వచ్చిన సంగతి తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా వందకు పైగా సంస్థలు కరోనా టీకా తయారీలో నిమగ్నమైతే.. కొన్ని కంపెనీలు మాత్రమే ముందడుగు వేశాయి. ప్రపంచంలో మొదటి టీకాను ఫైజర్ తయారు చేసింది. ఆ టీకాను వేసుకున్న తొలి పురుషుడిగా లండన్ కు చెందిన విలయం షేక్ స్పియర్ కు వేశారు. ప్రపంచంలో కొవిడ్ టీకాను వేసుకున్న తొలి వ్యక్తి రికార్డు ఆయన పేరిట నమోదైంది.
అయితే.. తాజాగా ఆయన కన్నుమూశారు. ఆయన మరణం కొవిడ్ యేతర ఆరోగ్య సమస్యల కారణంగా ఆయన మరణించినట్లుగా బ్రిటన్ మీడియా చెబుతోంది. గత ఏడాది డిసెంబరు 8న ఫైజర్ టీకా తొలి డోసును వారి్వక్‌షైర్‌లోని యూనివర్సిటీ హాస్పిటర్ కోవెంట్రీలో వేశారు.
ఇదే ఆసుపత్రిలో 91 ఏళ్ల మార్గరెట్ కీనన్ అనే మహిళకు కూడా కొవిడ్ వ్యాక్సిన్ వేశారు.ప్రపంచంలో కొవిడ్ 19 వ్యాక్సిన్ వేయించుకున్న మహిళగా ఆమె రికార్డు క్రియేట్ చేశారు. వ్యాక్సిన్ వేసుకున్న విలయం షేక్ స్పియర్ విషయానికి వస్తే.. కొవిడ్ తో సంబంధం లేని ఆరోగ్య సమస్యలతో తాను టీకా వేయించుకున్న ఆసుపత్రిలో చికిత్స కోసం చేరారు.
ఆయన ఈ నెల 20న మరణించిన విషయాన్ని కాస్త ఆలస్యంగా బ్రిటన్ మీడియా పుణ్యమా అని బయటకు వచ్చింది. ఆయనకు భార్య.. ఇద్దరు కొడుకులు ఉన్నట్లుగా చెబుతున్నారు. టీకా వేయించుకున్న తొలి వ్యక్తి మరణం పలువురిని కలిచివేస్తోంది.