`అదృష్టం బాగోపోతే అరటి పండు తిన్నా పన్నిరుగుద్ది.....అదృష్టం మీ ఇంటి మెయిన్ డోర్ తట్టేలోపు దురదృష్టం మాస్టర్ బెడ్రూంలో ముసుగేసుకొని పడుకుంది`.....ఇవి దురదృష్టవంతుడిని ఉద్దేశించి టాలీవుడ్ లో బాగా పాపులర్ అయిన డైలాగ్స్. సరిగ్గా ఈ డైలాగులకు సరిపోయే ఘటన ఒకటి ఫిలిప్పీన్స్ లో జరిగింది. అక్కడ ఓ జాలరి ఇంటి తలుపును అదృష్టలక్ష్మి బలంగా తట్టినా....అతడు గుర్తించలేకపోయాడు. తన ఇంట్లోనే పది సంవత్సరాలుగా పడున్న వందల కోట్ల విలువైన వస్తువును అతడు పసిగట్టలేకపోయాడు. కటిక దారిద్యంలో కొట్టుమిట్టాడుతూ.....నానా కష్టాలు పడుతున్న అతడిని చివరికి `లచ్చిందేవి` కరుణించింది. ఆ అభాగ్యుడికి ఎట్టకేలకు దురదృష్టంలో అదృష్టం కలిసి రావడంతో నేడు వందల కోట్ల రూపాయల ఆస్తి సొంతం చేసుకున్నాడు.
ఫిలిప్పీన్స్ దేశానికి చెందిన ఒక జాలరి 2006లో పాల్వన్ ద్వీపంలో చేపల వేటకు వెళ్ళాడు. ఆ రోజు అతడి వలలో చేపలతోపాటు మెరిసే విచిత్రమైన తెల్లటి రాయి ఒకటి పడింది. దాదాపు 35 కేజీల బరువున్న ఆ మెరిసే రాయి తన ఇంటికి అందంతో పాటు తనకు అదృష్టం కూడా తెస్తుందని భావించాడు. దాదాపు 10 ఏళ్లపాటు ఆ రాయి ఇంట్లోని ఓ మూల పడి ఉన్నా అదృష్టం కలిసిరాకపోగా దురదృష్టం వెంటాడింది. చేపల వ్యాపారంలో నష్టాలపాలై ....ఏవో పనులు చేసుకుంటూ కుటుంబ భారాన్ని మోస్తున్నాడు. మూలిగే నక్కమీద తాటికాయ పడ్డట్లు ప్రమాదవశాత్తూ అతడి ఇల్లు కాలిపోయింది. మంటలార్పిన తర్వాత బయటకు తెచ్చిన ఆ తెల్లటి రాయిని అగ్నిమాపక సిబ్బంది అధికారి గుర్తించాడు. అనుమానం వచ్చి దాని శాంపిల్ ను ల్యాబ్ లో పరీక్ష చేయించగా అది అత్యంత అరుదైన ముత్యమని తేలింది. మార్కెట్లో దాని విలువ దాదాపు రూ.670 కోట్లు ఉంటుందని తెలియడంతో ఆ జాలరి ఎగిరి గంతేశాడు. ఆ రాయే...ముత్యమని గుర్తించలేకపోయినందుకు చింతిచాడు. లచ్చిందేవికీ ఓ లెక్కుందని నవ్వుకున్నాడు. ఇప్పటికైనా లక్ష్మీదేవి తననకు కరుణించిందని సంతోషించాడు. ప్రస్తుతం10 అంతస్థుల భవనానికి యజమాని అయిన ఆ జాలరి రెండు ఆడీ కార్లు కొన్నాడు. ఖర్చులన్నీ పోగా మిగిలిన రూ.500 కోట్లతో ఏం చేయాలా అని తాపీగా ఆలోచిస్తున్నాడు.