మంచి చేయటం పాపమా? వ్యవస్థలోని తప్పుల్ని సరిదిద్దేందుకు చేసే ప్రయత్నాలకు ఇన్ని అడ్డంకులా? అన్న భావన కలిగేలా చేస్తున్నయి తాజాగా చోటు చేసుకుంటున్న పరిణామాలు. ప్రజాధనాన్ని వృధా చేసిన బాబు హయాంలోని విద్యుత్ కొనుగోలు ఒప్పందాల్ని సమీక్షించేందుకు ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి డిసైడ్ చేయటం పెను సంచలనంగా మారింది.
ఈ ఒప్పందాల లెక్కలు తీసే ప్రయత్నం చేయొద్దంటూ.. పునః సమీక్ష సరికాదంటూ ఇప్పటికే మోడీ సర్కారు నుంచి జగన్ ప్రభుత్వానికి వార్నింగ్ రావటం తెలిసిందే.ఇది సరిపోదన్నట్లుగా మరో ప్రైవేటు సంస్థ హెచ్చరిక జారీ చేయటం ఆసక్తికరంగా మారింది. ఒక విషయంలో ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాలు సరైనవా? కావా? ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశాయా? లాంటి సమీక్షలతో వచ్చే నష్టం ఏమిటి?
ప్రభుత్వాలు ఖర్చు చేసే ప్రతి పైసాకు జవాబుదారీతనం ఉండాలని సీఎం జగన్ భావించటం అంత పెద్ద నేరం అవుతుందా? అన్నది క్వశ్చన్. తాజాగా కార్పొరేట్ రేటింగ్ సంస్థ ఫిచ్ ఒక హెచ్చరిక జారీ చేసింది. విద్యుత్ కొనుగోలు ఒప్పందాల్ని సమీక్షించేందుకు ప్రయత్నిస్తున్న ఏపీ ప్రభుత్వం చర్యల కారణంగా విద్యుత్ ఉత్పత్తి కంపెనీలపై ప్రతికూల ప్రభావాన్ని చూపితాయని పేర్కొన్నారు.
సౌర.. పవన విద్యుత్ కొనుగోలు ఒప్పందాల లెక్క విషయంపై అధ్యయనం చేయటం ద్వారా ప్రజాధనం ఎంత వృధా అవుతుందన్న విషయంపై దృష్టి పెట్టినంతనే కేంద్రం నుంచి వచ్చిన హెచ్చరిక కలకలం ఇంకా ఒక కొలిక్కి రాకముందే.. ఫిచ్ తాజాగా కొన్ని వ్యాఖ్యలు చేసింది. ఏపీ ప్రభుత్వం చేపట్టిన చర్యల కారణంగా తీవ్రమైన సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుందని పేర్కొంది.
ఏపీ సర్కారు పీపీఎలను విజయవంతంగా పునఃసమీక్షించినా విద్యుత్ సంస్థలు ఇబ్బందులు ఎదుర్కొంటాయని.. ఈ చర్యల కారణంగా ఆయా సంస్థలకు కొన్ని పరిమిత రుణ సంస్థలు అందించే బాండ్ల విలువ తగ్గిపోతుందని వార్నింగ్ ఇచ్చింది. ప్రజాధనం ఏమైతే కానీ.. కార్పొరేట్ కంపెనీల విలువ తగ్గే విషయంలో ఏ ప్రభుత్వం నిర్ణయం తీసుకోకూడదన్నట్లుగా లేదు ఫిచ్ మాటల్ని చూస్తుంటే?