బాయ్ ఫ్రెండ్ ను కట్టేసి బాలికపై ఐదుగురి గ్యాంగ్ రేప్

Update: 2020-10-10 12:30 GMT
జార్ఖండ్ రాష్ట్రంలోని జంషెడ్ పూర్ లో దారుణం జరిగింది. 17 ఏళ్ల బాలికపై ఐదుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. మంగళవారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది.

మంగళవారం రాత్రి జంషెడ్ పూర్ లోని బాగ్బెరా ప్రాంతంలో ఓ బాలిక బాయ్ ఫ్రెండ్ తో కలిసి బయటకు వెళ్లింది. ఆ సమయంలో ఐదుగురు వ్యక్తులు ఆ జంట వద్దకు వచ్చి గన్ తో బెదిరించారు. బలవంతంగా ఆ యువతిని.. ఆమె బాయ్ ఫ్రెండ్ ను గోశాలకు తీసుకెళ్లారు. ఆమె బాయ్ ఫ్రెండ్ ను తాళ్లతో కట్టేసి బాలిపై అత్యాచారానికి పాల్పడ్డారు.

బాలిక ఫిర్యాదు మేరకు నిందితులపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. డ్యాన్స్ క్లాస్ కు వెళ్లి వస్తుండగా గుర్తు తెలియని వ్యక్తులు తనను కిడ్నాప్ చేశారని బాలిక ఫిర్యాదు చేసిందన్నారు. బాయ్ ఫ్రెండ్ తో కలిసి బయటకు వెళ్లినట్లు గుర్తించామన్నారు. నిందితులను గుర్తించి అరెస్ట్ చేశామని పోలీసులు తెలిపారు. నిందితుల్లో ఒకరు మైనర్ అని తెలిపారు. వారి వద్ద నుంచి గన్ తోపాటు రెండు బుల్లెట్లను కూడా స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు.

ఉత్తరప్రదేశ్ లోని హత్రాస్ లో హత్యాచారం మరిచిపోకముందే జార్ఞండ్ లో గ్యాంగ్ రేప్ సంచలనమైంది. దీనిపై మహిళా లోకం ఆందోళన వ్యక్తం చేస్తోంది. దేశంలో మహిళలపై అత్యాచారాలు, నేరాలు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
Tags:    

Similar News