రాజ‌ధాని మార్పు చేర్పులు.. తెలిసింది ఆ ఐదుగురికే?

Update: 2019-12-19 06:06 GMT
ఏపీ రాజ‌ధాని వ్య‌వ‌హారంలో మార్పు చేర్పుల గురించి ముందే అవ‌గాహ‌న ఉన్న వ్య‌క్తులు ఐదు మంది అని ఎమ్మెల్యేల్లో చ‌ర్చ సాగుతూ ఉంది. ఆ ఐదు మందికీ రాజ‌ధాని మార్పు చేర్పుల అంశాలపై అవ‌గాహ‌న ఉంద‌ని ఎమ్మెల్యేలు అనుకుంటూ ఉన్నారు.

ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి - పార్టీలో నంబ‌ర్ టు - త్రీ - ఫోర్ పొజిష‌న్ల‌లో ఉన్న నేత‌ల‌తో పాటు.. ఒక మంత్రికి ఈ అంశాల గురించి పూర్తి అవ‌గాహ‌న ఉంద‌ని వారు చెప్పుకుంటున్నారు. అంత‌కు మించి ఈ అంశంపై బ‌య‌టి వాళ్ల‌కు పెద్ద‌గా స‌మాచారం లేద‌ని భోగ‌ట్టా.

ముందే లీకులు వ‌స్తే.. ఎమ్మెల్యేలు - నేత‌లు విప‌రీత స్థాయిలో భూములు కొనుగోలు చేసే అవ‌కాశాలుంటాయి. అయితే ఇప్పుడు అలాంటి అవ‌కాశం ఏర్ప‌డ‌లేద‌ని స‌మాచారం. తెలుగుదేశం హ‌యాంలో రాజ‌ధాని అంశంపై ముఖ్య‌మైన వాళ్ల‌కు ముందుగానే స‌మాచారాలు అందాయ‌నే అభిప్రాయాలున్నాయి.

రాజ‌ధానిగా ప్ర‌క‌టించ‌బ‌డిన అమ‌రావ‌తి ప్రాంతంలో..  తెలుగుదేశం పార్టీ వాళ్లు భారీ ఎత్తున భూములు కొనుగోలు చేసిన వైనాలు కూడా వెలుగు చూశాయి. ఎక్క‌డో రాయ‌ల‌సీమ ప్రాంతానికి చెందిన తెలుగుదేశం పార్టీ నేత‌లు కూడా అమ‌రావ‌తి ప్రాంతానికి వెళ్లి భారీగా భూములు కొనుగోలు  చేశారు రాజ‌ధాని ప్ర‌క‌ట‌న వ‌చ్చే స‌మ‌యానికే! రాయ‌ల‌సీమ నేత‌లు హైద‌రాబాద్ లో భూములు క‌లిగి ఉన్నార‌న్నా అదో లెక్క‌. అయితే విజ‌య‌వాడ ప్రాంతంలో భూములు కొనుగోలు చేసే వ్య‌వ‌హారాలు చాలా త‌క్కువ‌. అయినా అమ‌రావ‌తి  ప్రాంతంలో సీమ టీడీపీ నేత‌లు భారీగా భూములు కొనుగోలు చేయ‌డం అనేక అనుమానాల‌కు తావిచ్చింది.

ఇప్పుడు మాత్రం పెద్ద‌గా లీకులు లేవు. తెలిసింది హై లెవ‌ల్ నేత‌ల‌కే. ఇలా మంచి అవ‌కాశం త‌మ‌కు త‌ప్పిపోయింద‌న్న‌ట్టుగా కొంత‌మంది వైసీపీ నేత‌లు భావిస్తున్నార‌ట‌! మూడు ప్రాంతాల్లో రాజ‌ధాని అంటూ సీఎం జ‌గ‌న్ స్వ‌యంగా ప్ర‌క‌టించేశారు కాబ‌ట్టి.. ఆయా ప్రాంతాల్లో రియ‌లెస్టేట్ పుంజుకునే అవ‌కాశాలు పుష్క‌లంగా క‌నిపిస్తున్నాయి.
Tags:    

Similar News