వరంగల్ బావి నుంచి వెలికి తీసిన 9 మృతదేహాల వ్యవహారంలో అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి. ఎవరైనా హత్య చేశారా..? లేక వారే అత్మహత్య చేసుకున్నారా..? తొమ్మిది మంది మృత దేహాలు బావిలో నుంచి బయట పడటంతో ఎవరికి అంతుచిక్కటం లేదు. కూలీలను చంపాల్సినంత అవసరం ఎవరికుంది..? అసలు చంపారా..? లేకుంటే వాళ్లే అత్మహత్య చేసుకున్నారా..? అనేదీ ఇప్పుడు అందరి మెదళ్లను తొలుస్తుండటం ఉత్కంఠకు దారి తీస్తోంది. దీనితో ఈ కేసు దర్యాప్తు కూడా పోలీసులకి ఒక పెద్ద సవాల్ గా మారింది.
ఈ కేసును సవాల్ గా తీసుకున్న విచారణ కోసం పోలీసు శాఖ ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసింది. మృతి చెందిన వారి ఫోన్లు సాయంత్రమే స్విచ్ఛాఫ్ కావడం మక్సూద్ ఫోన్ మాత్రం రాత్రి 9 గంటల వరకు ఆన్ లోనే ఉండటంతో, అతడిపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మక్సూద్ కుమారుడి పుట్టిన రోజు వేడుకలను బుధవారం రాత్రి నిర్వహించగా.. అందరూ కలిసి విందు చేసుకున్నారు. గురువారం తెల్లారేసరికి ఇంట్లో ఎవరూ లేకపోవడంతో వారి ఆచూకీ కోసం గాలించగా బావిలో నాలుగు శవాలు కనిపించాయి. శుక్రవారం మరో ఐదు శవాలను వెలికి తీశారు. మృతదేహాలను గుర్తించిన అనంతరం మక్సూద్ నివాసం ఉంటున్న గదులను తనిఖీ చేయగా.. అతడి జేబులో కండోమ్ ప్యాకెట్ కనిపించింది. పెళ్లయ్యి ముగ్గురు పిల్లలున్న అతడి దగ్గర కండోమ్ ఉండటం అనుమానాలకు తావిస్తోంది. అందరి సెల్‌ఫోన్లు సాయంత్రమే స్విచ్ఛాఫ్ కాగా మక్సూద్ ఫోన్ రాత్రి వరకు ఆన్‌లో ఉండటం అనుమానాలకు మరింత బలం చేకూరుస్తోంది.
అసలు ఈ ఘటన కు సంబంధించిన పూర్తి వివరాలు చూస్తే ..పశ్చిమ బెంగాల్ కు చెందిన మక్సూద్ కుటుంబం 20 ఏళ్ల క్రితమే వరంగల్ వచ్చి స్థిరపడింది. మక్సూద్ భార్య, ఇద్దరు కుమారులతోపాటు, భర్తకు దూరంగా ఉంటున్న ఆయన కుమార్తె బుస్రా కూడా తన మూడేళ్ల కొడుకుతోపాటు వీరితోనే ఉంటోంది. ఇంతకు ముందు వారు కరీమాబాద్‌లో ఉండగా... లాక్ డౌన్ కారణంగా రాకపోకలకు ఇబ్బందిగా ఉండటంతో.. వారు పని చేసే గోడౌన్ లో ఉన్న రెండు గదుల్లోకి మకాం మార్చారు. అదే గోడౌన్ లో బిహార్ కు చెందిన మరో ఇద్దరు యువకులు కూడా నివాసం ఉంటున్నారు.
సాయంత్రం ఆరు గంటలకు మక్సూద్ మినహా అందరి సెల్‌ఫోన్లు స్విచ్ ఆఫ్ అయ్యాయి. ఏడు గంటలకి షకీల్ అనే వ్యక్తిని తన ఇంటికి రావాలని మక్సూద్ పిలిచినట్టు తెలుస్తోంది. రాత్రి 7.45 గంటలకు గోదాం యజమానితో మక్సూద్ మాట్లాడాడు. రాత్రి 9 గంటల సమయంలో అతడి ఫోన్ స్విచ్ఛాఫ్ అయ్యింది. దీంతో సాయంత్రం నుంచి రాత్రి 9 గంటల మధ్య ఏం జరిగిందో తెలుసుకునే పనిలో పడ్డారు పోలీసులు.
ఇక ఈ కేసులో మరో అంశం కూడా కీలకంగా మారింది. భర్తతో విడిపోయిన మక్సూద్ కూతురు బుస్రా నగరంలోని ఓ వ్యక్తితో వివాహేతర సంబంధం ఉన్నట్లుగా ప్రచారం జరుగుతోంది. ఇక అంతేకాదు ఈ వ్యవహారంలో బుస్రాకు తన తల్లితో గొడవలు జరుగుతున్నట్లు సమాచారం. ఇంటిపై ఉంటున్న బీహార్‌కు చెందిన వారు శ్రీరాం, శ్యామ్‌లు వీరి గొడవలో జోక్యం చేసుకున్నట్టుగా తెలుస్తుంది. అంతే కాదు వీరు బుస్రాపై కన్నేసినట్లు కూడా తెలుస్తుంది.
ఈ విషయం తెలుసుకున్న బుస్రా ప్రియుడు వారితో చనిపోవటానికి ముందు రోజు మక్సూద్ ఇంట్లో బర్త్ డే విందుకు హాజరైనట్లుగా చెబుతున్నారు. ఈ విందులో జరిగిన ఘర్షణతో బీహార్ యువకులు మసూద్ కుటుంబాన్ని చంపి బావిలో పడేసి.. భయంతో వారు ఆత్మహత్యకు పాల్పడి ఉంటారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఏది ఏమైనా పోలీసులకు పెద్ద సవాల్ విసిరిన ఈ కేసులో ఫోన్ కాల్స్ ఎవరితో మాట్లాడారు. అక్కడ అసలు ఏం జరిగి ఉంటుంది అన్న దర్యాప్తు చేస్తున్న పోలీసులు పోస్ట్ మార్టం నివేదికల ఆధారంగా కేసులో కీలక దర్యాప్తు కొనసాగించనున్నారు.