యడ్డ్యూరప్ప మంత్రి వర్గ విస్తరణ కు ముహూర్తం ఫిక్స్ ...ఆ ఆరుగురు అవుట్

Update: 2019-12-28 07:38 GMT
కర్ణాటక రాజకీయం రోజుకో మలుపు తిరుగుతుంది. ఈ మధ్య ఉప ఎన్నికల ఫలితాలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ ఎన్నికలలో బీజేపీ ని ఓడించి మళ్లీ సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనీ భావించిన జేడీఎస్ , కాంగ్రెస్ వ్యూహాలని బీజేపీ బద్దలు కొడుతూ మెజారిటీ కి కావాల్సిన సీట్ల ని గెలుచుకొంది. ఇక ఆ తరువాతే అసలు సమస్య మొదలైంది. అనర్హత వేటు పడిన ఎమ్మెల్యేలందరిని కర్ణాటక క్యాబినెట్ లోకి తీసుకోవాలని సీఎం అధిష్ఠానానికి స్పష్టమైన సూచనలు చేసినట్లు తెలుస్తోంది. కర్ణాకటకలో బీజేపీ ప్రభుత్వం రావడానికి వీరే ప్రధాన కారణం కావడం ..సీఎం యడ్డ్యూరప్ప ఎట్టి పరిస్థితుల్లో అందరిని క్యాబినెట్ లోకి తీసుకోవాలని చూస్తున్నారు. దీనితో ఉప ఎన్నికల ఫలితాలు వెలువడినప్పటి నుంచి సాగుతున్న వివాదానికి సీఎం యడియూరప్ప ముగింపు పలికినట్టు తెలుస్తుంది.

17మంది ఎమ్మెల్యే లు రాజీనామా లు చేసి అనర్హులు గా మారగా సుప్రీం తీర్పునకు అనుగుణంగా 15 నియోజకవర్గాలకు జరిగిన ఎన్నికల్లో 12మంది బీజేపీ ఎమ్మెల్యేలు గెలుపొందారు. సీనియర్‌ లు ఎంటీబీ నాగరాజ్‌, విశ్వనాథ్‌లు ఓడిపోగా రాణి బెన్నూరు నుంచి శంకర్‌ పోటీ చేయలేదు. గెలుపొందినవారికి కేబినెట్‌ లోకి స్థానం ఖాయం కావడంతో, మిగిలిన ఇరువురి పరిస్థితిపై భిన్నాభిప్రాయాలు కొనసాగుతున్నాయి. ఓడిన వారికి కేబినెట్‌ లో చోటు ఉండదని పలువురు సీనియర్‌ నేతలు అభిప్రాయ పడ్డారు. దీంతో ఎంటీబీ నాగరాజ్‌ పలుమార్లు సీఎం యడియూరప్పతో భేటీ అయ్యారు. ప్రస్తుతం ధనుర్మాసం అడ్డురావడంతో సంక్రాంతి తర్వాత విస్తరణ చేస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు. తాజాగా ఆ ఇరువురికి కూడా క్యాబినెట్ లో చోటు ఇష్టం అని చెప్పడం తో పార్టీలోని సీనియర్లు ఆలోచనలో పడ్డారు. ఈ ముగ్గురినీ జూన్‌లో ఖాళీ అయ్యే ఎమ్మెల్సీ స్థానాల ద్వారా భర్తీ చేయ దలిచారు. ప్రస్తుత కేబినెట్‌లో ఏకంగా ఆరుమందిని తప్పించి కొత్తవారికి అవకాశం ఇచ్చే ఆలోచన చేస్తునట్టు తెలుస్తుంది. హోం మంత్రి బసవరాజ్‌ కు మంత్రి వర్గం నుండి ఉద్వాసన తప్పదనే అంశం శుక్రవారం విధాన సౌధలో హల్‌ చల్‌ చేసింది. ఈయన తో  పాటుగా పలువురు సీనియర్ల ని మంత్రి వర్గయం నుండి తప్పించడానికి సన్నాహాలు చేస్తునట్టు తెలుస్తుంది.


Tags:    

Similar News