ఏపీలో అధికార తెలుగుదేశంలో పార్టీలో నెలకొన్న వర్గ విబేధాలు, అసంతృప్తులు రోడ్డున పడుతున్నాయి. అందులోనూ జంప్ జిలానీలకు పార్టీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అగ్రతాంబులం వేయడంపై పార్టీ శ్రేణులు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నాయి. ఈ క్రమంలో అంతర్గత సంభాషణల్లో తమ అసంతృప్తిని వెళ్లగక్కే స్థాయి నుంచి ఏకంగా ఫ్లెక్సీలు వేసి నిరసన తెలిపే స్థాయికి ఆగ్రహం చేరిపోయింది. అది కూడా సాక్షాత్తు రాజధాని అమరావతి ప్రాంతంలో జరిగింది. టీడీపీ అధికార ప్రతినిధి డొక్కా మాణిక్యవరప్రసాద్ కు ఎమ్మెల్సీ పదవి ఇవ్వడాన్ని నిరసిస్తూ తుళ్లూరు మండలం దొండపాడులో ఫ్లెక్సీ వెలిసింది. ఈ ఫ్లెక్సీ కలకలం సృష్టించింది.
దొండపాడు పంచాయతీ కార్యాలయం ఎదురుగా ఉన్న బస్ షెల్టరుపై టీడీపీ గ్రామ పార్టీ పేరుతో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ రాజధాని ప్రాంతంలో తీవ్ర చర్చనీయాంశమైంది. కాంగ్రెస్ హయాంలో డొక్కా మాణిక్యవరప్రసాద్ మంత్రిగా పనిచేసినప్పుడు గ్రామంలోని ఎన్ టీఆర్ విగ్రహాన్ని కూలగొట్టేందుకు యత్నించారని ఈ ఫ్లెక్సీ పేర్కొంది. అలా పార్టీ వ్యవస్థాపకుడిని, టీడీపీని తీవ్రంగా వ్యతిరేకించిన వారిని అందలమెక్కిస్తూ పార్టీకోసం కష్టపడేవారిని విస్మరించడాన్ని నిరసిస్తూ తెలుగు తమ్ముళ్లు ఫ్లెక్లీ ఏర్పాటు చేశారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/