సీఎం అడ్డాలో ఫ్లెక్సీ.. ఇప్పుడెందుకు హాట్ టాపిక్?

Update: 2020-12-11 12:30 GMT
సంక్షేమ పథకాల కోసం వేలాది కోట్ల రూపాయిల్ని ఖర్చు పెడుతున్న జగన్ సర్కారుకు..కొందరు అధికారుల నిర్లక్ష్యం ఇబ్బందికరంగా మారుతోంది. ప్రజలకు సాయంగా ఉండాలని.. వారికి మౌలిక సదుపాయాలు కల్పించే విషయంలో అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలన్నది ప్రభుత్వ లక్ష్యమైతే.. అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్న కొందరు అధికారుల కారణంగా చెడ్డపేరు వస్తోంది. తాజాగా ఒక ఫ్లెక్సీ వైరల్ గా మారింది.

సీఎం జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లా కడపలో చోటు చేసుకున్న ఒక ఉదంతం ఇప్పుడు అందరిని ఆకర్షిస్తోంది. కడప పట్టణంలోని 15వ వార్డు నుంచి వెళ్లే ప్రధాన రహదారి లేదు. ఇతర ప్రాంతాలకు వెళ్లేందుకు అది ముఖ్యమైన రోడ్డు. అయితే.. గడిచిన పదిహేనేళ్లుగా అక్కడ రోడ్డు వేయాలని స్థానికులు కోరుతున్నారు. అయినప్పటికి పట్టించుకున్ననాథుడు లేడు.

దీంతో విసిగిపోయిన స్థానికులు ఇల్లులిల్లు తిరిగి.. దాతల సహకారంతో విరాళాలు సేకరించారు. అలా సేకరించిన మొత్తం రూ.2.10లక్షలు జమ అయ్యాయి. ఆ డబ్బుతో వారే స్వయంగా కంకరరోడ్డును వేసుకున్నారు. ఈ రోడ్డు ప్రారంభంలో జగనన్న పాలనలో ప్రజారోడ్డు అన్న ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. ప్రభుత్వ అధికారుల తీరుకు నిరసనగా పెట్టిన ఈ ఫ్లెక్సీ ఇప్పుడు వైరల్ గా మారింది. ప్రజా సమస్యలు పట్టని నిర్లక్ష్య అధికారులపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
Tags:    

Similar News