విమానం ఏంటి? రోడ్డు మీద.. అది కూడా ఫుట్ ఓవర్ బ్రిడ్జి కింద ఇరుక్కుపోవటమా? అదెలా సాధ్యం? అన్న సందేహం కలుగుతుంది.కానీ.. తాజాగా వైరల్ అవుతున్న వీడియోను చూస్తే.. నిజమే కదా? అనిపించటంతో పాటు విస్మయానికి గురి కావాల్సి వస్తుంది. తాజాగా దేశ రాజధాని ఢిల్లీలోని ఒక ఫుట్ ఓవర్ బ్రిడ్జి కింద రెక్కల్లేని విమానం ఒకటి ఇరుక్కుపోయిన వీడియో వైరల్ గా మారింది. ఇంతకూ ఇదెలా సాధ్యమైంది? అన్న ప్రశ్నకు సమాధానం వెతికితే..
ఢిల్లీ ఎయిర్ పోర్టుకు సమీపంలోని గుర్ గ్రామ్ - ఢిల్లీ హైవేల మీద ఈ అనూహ్య ఘటన చోటుచేసుకుంది. ఎయిర్ ఇండియా పాత విమానాన్ని గతంలో ఎప్పుడో దాన్ని అమ్మేశారు. అది అప్పటికే చెడిపోయిన పాత విమానమని.. దాని యజమాని రెక్కల్ని ఊడదీసి.. వేరే ప్రాంతానికి తరలిస్తున్నవేళ.. అనుకోని రీతిలో అంచనాలు తప్పై.. ఫుట్ ఓవర్ బ్రిడ్జి కింద ఇరుక్కుపోయింది. దీంతో.. దీనికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేయటంతో అది కాస్తా వైరల్ గా మారింది.

#WATCH An @airindiain plane ✈️ (not in service) got stuck under foot over bridge. Can anyone confirm the date and location?
The competition starts now