ఏపికి చెందిన పలువురు అధికారపక్ష నేతలతో పాటు.. పలువురు ప్రముఖులకు హర్రర్ సినిమా కనపించిన పరిస్థితి. ఢిల్లీ నుంచి హైదరాబాద్ మీదగా విజయవాడ వెళ్లాల్సిన విమానంలో చోటు చేసుకున్న సాంకేతిక లోపం.. పలువురు ప్రముఖులకు చేదు అనుభవాన్ని మిగిల్చింది.
మంగళవారం సాయంత్రం ఢిల్లీలోబయలుదేరిన ఎయిరిండియా విమానం హైదరాబాద్ కు చేరుకుంది. అక్కడి నుంచి బయలుదేరి.. ఆకాశంలోకి ఎగిరిన తర్వాత సాంకేతిక లోపం చోటు చేసుకుంది. ఏసీ పని చేయకపోవటం.. పెద్ద పెద్ద కుదుపులకు గురి కావటంతో నేతలు ఆందోళనలో పడ్డారు. దీంతో.. విమానాన్ని శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో దించేశారు. ఎయిర్ పోర్ట్ లో విమానం దిగిన ఇరవై నిమిషాల వరకూ విమానం తలుపులు తెరుచుకోని పరిస్థితి.
ఈ అంశాలపై తీవ్ర అగ్రహం వ్యక్తం చేసిన ఏపీ అధికారపక్ష నేతలు ఎయిరిండియా వైఖరిపై తీవ్రంగా మండిపడ్డారు. ఈ విషయాన్ని కేంద్ర విమానయాన శాఖామంత్రి.. తమ పార్టీకే చెందిన సీనియర్ నేత అశోక్ గజపతికి ఎయిరిండియా సిబ్బందిపై ఫిర్యాదు చేశారు. చివరకు విమానంలోని సాంకేతిక లోపాలు సర్దుబాటు చేసి రాత్రి ఏడు గంటలకు విజయవాడకు బయలుదేరిన ఈ విమానం ఎలాంటి ఇబ్బందులు లేకుండా రాత్రి 8.30గంటలకు గమ్యస్థానానికి చేరుకుంది. ఈ విమానంలో పలువురు టీడీపీ.. బీజేపీ నేతలతో పాటు.. మొత్తం 119 మంది ప్రయాణికులున్నారు.