పెదవే పలికిన మాటల్లోని తియ్యని మాటే అమ్మ... కదిలే దేవత అమ్మ.... కంటికి వెలుగమ్మ....కన్నతల్లి ఔన్నత్యాన్ని గురించి ఓ తెలుగు కవి రాసిన పాట ఇది. అయితే ఇందుకు పూర్తి భిన్నంగా కన్న బిడ్డల పట్ల కర్కశంగా వ్యవహరించే తల్లులు కూడా ఉన్నారు. ఫ్లోరిడాకు చెందిన ఓ తల్లి పైశాచికానందం కోసం పిల్లల ప్రాణాలను పణంగా పెట్టింది.
తన కన్న కూతుర్ని పాము కాటేస్తుంటే కాపాడాల్సింది పోయి తన సెల్ ఫోన్ లో వీడియో తీసింది. అంతేకాదు, ఏకంగా ఆ ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి తన పైశాచికత్వాన్ని చాటుకుంది. ఆ వీడియో చూసిన నెటిజన్లు ఆమెపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
నెటిజన్ల నుంచి తీవ్రమైన విమర్శలు రావడంతో ఆమె వీడియోను తొలగించింది. అయితే, ఈ వీడియో వైరల్ గా మారి పోలీసులకు తెలిసింది. దీంతో, ఆ తల్లిని అదుపులోకి తీసుకున్న పోలీసులు ఆమెపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇంత జరిగినా అమె తన హేయమైన చర్యను సమర్థించుకోవడం గమనార్హం. ఆమె కావాలనే పాముతో తన కూతురును కరిపించానని చెబుతోంది. పాములంటే పిల్లలకు భయం ఉండకూడదని, ఆ భయాన్ని పోగొట్టడానికే తాను ఇలా చేశానని తెలిపింది. అంతేకాదు, ఆ పాముతో తాను కరిపించుకున్నానని, తన కొడుకుని కూడా ఆ పాము కరిచిందని చెబుతోంది. ఆమె మానసిక స్థతిపై పోలీసులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/