కమల్ హాసన్ కు చేదు అనుభవం

Update: 2021-03-23 02:40 GMT
ప్రముఖ నటుడు, మక్కల్ నీది మయ్యమ్ (ఎంఎన్ఎం) అధినేత కమల్ హాసన్ కు చేదు అనుభవం ఎదురైంది. ఆయన ప్రచార వాహనాన్ని ఎన్నికల అధికారులు తనిఖీ చేశారు. సోమవారం తిరుచ్చిలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి వెళ్తుండగా.. తంజావూరు జిల్లాలో వాహనాన్ని ఆపి ఫ్లయింగ్ స్క్వాడ్ బృందం సోదాలు చేసింది.

కమల్ హాసన్ తొలిసారి తమిళనాడు అసెంబ్లీ బరిలో దిగారు. కోయంబత్తూరు సౌత్ నియోజకవర్గం నుంచి పోటీచేస్తున్నారు. ఈ నియోజకవర్గంలో కమల్ హాసన్ విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు.రోజంతా ఓటర్లను కలుసుకునే పనిలో ఉన్నారు.చిరు వ్యాపారులతో ముచ్చటిస్తున్నారు. ప్రజల సమస్యలు తెలుసుకుంటున్నారు.

పొత్తులో భాగంగా కమల్ పోటీచేస్తున్న కోయంబత్తూర్ సౌత్ ను అన్నాడీఎంకే బీజేపీకి ఇచ్చింది. బీజేపీ అభ్యర్థి వనతి పోటీచేస్తున్నారు.

డీఎంకే - కాంగ్రెస్ కూటమి తరుఫున కోయంబత్తూర్ సౌత్ నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మయూర జయకుమార్ పోటీచేస్తున్నారు. ఈ స్థానం నుంచి ఆయనకూ ఇది రెండో ప్రయత్నం. అన్నాడీఎంకేపై వ్యతిరేకత కలిసి వస్తుందని ఆయన భావిస్తున్నారు.

మొత్తం 234 స్థానాలున్న తమిళనాడు అసెంబ్లీకి ఏప్రిల్ 6న ఒకే దశలో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహిస్తున్నారు. కమల్ హాసన్ పార్టీ 154 స్థానాల్లో పోటీచేస్తోంది. మిగిలిన స్థానాలను భాగస్వామ్య పక్షాలకు కట్టబెట్టారు.
Tags:    

Similar News