అసెంబ్లీ ఎన్నికలకు తెర లేచి..పశ్చిమబెంగాల్‌రాజకీయాలు హాట్ హాట్ కానున్న సమయంలో అనూహ్య ఘటన ఒకటి చోటు చేసుకుంది. పశ్చిమబెంగాల్ రాష్ట్ర రాజధాని కోల్‌కతాలో నిర్మాణంలో ఉన్న ఒక ఫ్లైఓవర్ కుప్పకూలిపోయింది. ఈ దారుణ సంఘటన పశ్చిమబెంగాల్ లో తీవ్రసంచలనం సృష్టించింది.
కోల్‌కతా నగర ఉత్తర ప్రాంతంలో ఉన్న గిరీష్ పార్క్ సమీపంలో నిర్మిస్తున్న ఫ్లైఓవర్ ఒక్కసారిగా కుప్పకూలటంతో 10 మంది మృతి చెందారు. మరో 150 మంది వరకు శిధిలాల కింద ఉన్నట్లుగా అంచనా వేస్తున్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం బయటకు రావాల్సి ఉంది. ఎన్నికల వేళ.. దీదీ పాలనను ప్రశ్నించేలా తాజా ప్రమాదం ఉండటం గమనార్హం. నిర్మాణ నాణ్యతలోని లోపాలతో ఘోర ప్రమాదం జరిగిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.