ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నం జిల్లాలో విషాద ఘటన సంభవించింది. నిర్మాణంలో ఉన్న ఫ్లై ఓవర్ కూలిపోయింది. అనకాపల్లి జాతీయ రహదారి వద్ద జరిగిన ఈ దుర్ఘటనలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. హైవే విస్తరణలో భాగంగా జలగలమధుం జంక్షన్ సమీపంలో కొత్త ఫ్లై ఓవర్ నిర్మిస్తున్నారు. నిర్మాణంలోనే ఉండగానే ఈ ఫ్లై ఓవర్ కూలిగిపోయింది.
వంతెన సైడ్ భీమ్ లు పడిపోవడంతో.. ఆ సమయానికి సరిగ్గా వాటి కిందకు వచ్చిన కారు, ఓ ట్యాంకర్ లారీ నుజ్జు నుజ్జయ్యాయి. ఈ ఘటనలో కారులో ఉన్న బాలుడు, యువకుడు మతిచెందారు. మరో ముగ్గురు గాయాలతో బయటపడ్డారు.
ఇక, ట్యాంకర్ లారీలోని డ్రైవర్ కూడా తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే స్పందించిన స్థానికులు.. క్షతగాత్రులను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. కాగా.. ఆ ఫ్లై ఓవర్ కింద ఇంకా ఎంత మంది ఉన్నారు అనే విషయం తెలియలేదు. అదే సమయంలో.. గాయపడిన వారిలోపలువురు పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది.
సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. రెస్యూ సిబ్బందిని రప్పించి సహాయక చర్యలు చేపట్టారు. అధికారులు అక్కడికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలను ఆరాతీస్తున్నారు.