రోజులో లక్ష కోట్ల మదుపరుల సొమ్ము ఆవిరి.. రెండు రోజుల్లో రెండున్నర లక్షల కోట్ల మేర షేర్ల విలువ గాల్లో కలిసిపోతున్నట్లుగా తరచూ వార్తలు రావటం ఈ మధ్యన చూస్తున్నాం. మార్కెట్లు మందకొడిగా ఉండటం.. అంతర్జాతీయ పరిణామాలు.. డాలర్ కు తీవ్రమైన ఒత్తిడి పెరగటం.. ఇటీవల కాలంలో ఎప్పుడూ లేని రీతిలో మార్కెట్లు అదే పనిగా పడిపోతూ.. మదుపరులకు తీవ్రమైన నష్టాలు కలిగిస్తున్న వేళ.. మంచి రోజులు ఎప్పుడు వస్తాయన్న మాట అందరి నోట వినిపిస్తోంది.
ఇలాంటివేళ.. రంగంలోకి దిగారు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్. ఇటీవల కాలంలో ఎప్పుడూ లేనంత ఉత్తేజపూరిత నిర్ణయాల్ని ప్రకటించటం ద్వారా.. మార్కెట్లు అవాక్కు అయ్యేలా చేయటమేకాదు.. నిమిషాల వ్యవధిలో మార్కెట్లు దౌడు తీసేలా చేయటంలో సక్సెస్ అయ్యారని చెప్పాలి. ఇంతకూ నిర్మలమ్మ నోటి నుంచి వచ్చిన మాటలేంది? వాటి ప్రభావం ఈ స్థాయిలో ఎందుకుందన్న విషయంలోకి వెళితే.. దేశ ఆర్థిక వ్యవస్థకు కొత్త ఉత్తేజం ఇచ్చే ప్రయత్నంలో భాగంగా కేంద్రప్రభుత్వం దేశీయ కార్పొరేట్ ట్యాక్స్ ను 30 శాతం నుంచి 22 శాతానికి తగ్గించటం ఒక ఎత్తు అయితే.. కొత్త కంపెనీలకు కార్పొరేట్ ట్యాక్స్ ను 25 శాతం నుంచి 15 శాతానికి తగ్గిస్తూ కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు.
2019 అక్టోబరు ఒకటి తర్వాత తయారీ రంగంలో తాజా పెట్టుబడులతో ప్రారంభించే దేశీయ కంపెనీలకు కేవలం 15 శాతం ఆదాయపన్ను చెల్లించే వెసులుబాటు కల్పిస్తున్నట్లు చెప్పారు. కొత్త పన్ను రేట్లను ప్రకటించటం ద్వారా దేశీయ కార్పొరేట్ రంగానికి కొత్త శక్తిని ఇవ్వటమే కాదు.. ఉత్తేజపూరితంగా మారిన పన్ను రేట్లు.. కొత్త పెట్టుబడులకు పెద్ద ఎత్తున అవకాశాన్ని ఇస్తాయని చెప్పాలి.
తాజాగా మార్పులు చేసిన పన్ను తగ్గింపు రేట్ల కారణంగా కేంద్రానికి ఏటా రూ.1.45 లక్షల కోట్ల ఆదాయానికి గండిపడుతుందని అంచనా వేస్తున్నారు. ప్రభుత్వం ఈ మాట చెప్పినా.. వాస్తవం వేరేలా ఉంటుందని చెబుతున్నారు. ఇంతకాలం పన్నుపోటు భారీగా ఉండటం ద్వారా పన్ను ఎగవేతకు పాల్పడే వారు.. రానున్న రోజుల్లో పన్ను పరిధిలోకి తమ వ్యాపారాల్ని తెచ్చే వీలుందని.. దీంతో లోటు ఇంత భారీగా ఉండదనే అభిప్రాయం ఉంది.
ఇదంతా ఒక ఎత్తు అయితే.. ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ నోటి నుంచి తీపికబురు విన్నంతనే స్టాక్ మార్కెట్లు దౌడు తీయటం షురూ చేశాయి. బీఎస్ఈ సెన్సెక్స్ ఏకంగా 1400 పాయింట్ల లాభంతో విపరీతమైన వేగంతో పరుగులు తీస్తే.. నిఫ్టీ ఏకంగా గంటల వ్యవధిలో 424 పాయింట్ల లాభంతో సరికొత్త రికార్డుల్ని నెలకొల్పింది. తాజా ప్రకటన కారణంగా.. ఆ రంగం.. ఈ రంగం అన్న తేడా లేకుండా అన్ని కంపెనీల షేర్ల కొనుగోలు భారీగా సాగుతున్నాయి. దీంతో.. భారీ లాభాల దిశగా మార్కెట్ ప్రయాణిస్తోంది. 1400 పాయింట్ల లాభం అంటే.. దగ్గర దగ్గర 5లక్షల కోట్ల మదుపరుల సొమ్ము పెరిగిందని చెప్పక తప్పదు. గడిచిన కొద్దిరోజులుగా విపరీతమైన నష్టాలతో ట్రేడ్ అవుతున్న లోటును తాజా ఉత్తేజం అధిగమిస్తుందని చెప్పాలి.