నిర్మల ప్యాకేజీ: నగదు బదిలీ లేదు.. అంతా అసంతృప్తి

Update: 2020-05-15 10:10 GMT
ప్రధాని మోడీ 20 లక్షల ప్యాకేజీ ప్రకటించారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్యాకేజీలను విడతల వారీగా ప్రకటించేస్తున్నారు. అయితే దీనిపై మిశ్రమ స్పందన నెలకొంది. కొందరు సంతృప్తి వ్యక్తంచేస్తుంటే.. మరికొందరు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

ఈ ఉద్దీపన వల్ల ఆర్థిక వ్యవస్థలోకి నేరుగా వచ్చేది ఏమీ లేదని పరిశ్రమ వర్గాలు ఆరోపిస్తున్నాయి. కేంద్రం రూ.12 లక్షల కోట్ల రుణాలపై స్పష్టత లేదని చెబుతున్నారు.

నిర్మలా ప్రకటించిన ప్యాకేజీలో ప్రత్యక్ష నగదు మద్దతు లేదని పరిశ్రమ వర్గాలు, సామాన్యులు పెదవి విరుస్తున్నాయి. నగదు బదిలీ లేకుంటే ఈ ఉద్దీపన ప్యాకేజీ ప్రభావం అస్సలు ఉండదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

ఎంఎస్ఎంఈలు, రైతులు.. సమాజంలోని బలహీన వర్గాలకు తక్షణమే రుణాలు డైరెక్టుగా లబ్ధి చేకూర్చవని నిపుణులు చెబుతున్నారు. రుణాలు తీసుకునే రైతులు ఇప్పటి నుంచి కొద్ది నెలల తర్వాత మాత్రమే పంటల ద్వారా ప్రయోజనం పొందుతారని అంటున్నారు.

నిర్మల ప్యాకేజీలు ఆర్థిక వ్యవస్థలోకి నేరుగా వెళ్లేలా లేవని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. వలస కార్మికులకు నేరుగా ప్రయోజనం శూన్యమని.. దీర్ఘకాలంలో మాత్రమే సహకరిస్తాయని చెబుతున్నారు.
Tags:    

Similar News