ఒకసారి ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత.. ఎవరి మాటను వినేందుకు ఇష్టపడని తత్త్వం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఎంత ఎక్కువో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఏ సమయంలో ఏ పంట వేయాలన్న విషయంలో రైతులకు అవగాహన లేదని.. తాను చెప్పినట్లు మాత్రమే పంటలు వేయాలని డిసైడ్ చేసిన ఆయన.. ఒకవేళ తన మాట కాదని వేరే పంటను పండిస్తే.. తాను ఏడాదికి రెండుసార్లు ఇచ్చే రైతుబంధు పథకానికి బ్రేకులు వేస్తానని వార్నింగ్ ఇవ్వటం తెలిసిందే.
రైతులంతా ఒకే పంట వేయటం ద్వారా డిమాండ్ తగ్గుతుందని.. అందుకే ఈ అంశం మీద ప్రభుత్వం పలు విధాలుగా ఆలోచించి.. ఒక విధానాన్ని సెట్ చేసినట్లుగా కేసీఆర్ చెబుతున్నారు. ఏ సీజన్ లో.. ఎక్కడ ఏ పంట వేయాలి? ఏ సాగు చేయాలన్న విషయాన్ని వ్యవసాయ శాస్త్రవేత్తలు డిసైడ్ చేశారని.. దాని ప్రకారమే.. పంటలు వేయాలని రైతులకు స్పష్టం చేస్తున్నారు కేసీఆర్.
తాను డిసైడ్ చేసినట్లుగా పంటలు పండించాలన్న కేసీఆర్ ఆలోచనలకు తగ్గట్లే.. గురువారం ప్రగతి భవన్ లో విస్తృత స్థాయి సమావేశం జరిగింది. మంత్రులు.. సీనియర్ అధికారులతో పాటు.. వివిధ కార్పొరేషన్ ఛైర్మన్లు.. జిల్లా కలెక్టర్లు.. వ్యవసాయ అధికారులు.. సైంటిస్టులు.. జిల్లాల నుంచి వచ్చిన వారితో ముఖాముఖి సమావేశాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా కేసీఆర్ నోటి వెంట కీలక వ్యాఖ్యలే కాదు.. రానున్న రోజుల్లో రైతులు తమ ఆదేశాల్ని పక్కాగా పాటించాలో కోరారు. గత ఏడాది వర్షాకాలంలో ఎంత పంట వేశారు? ఎన్ని ఎకరాల్లో సాగు చేసింది చెప్పిన ఆయన.. ఈసారి ఎంత విస్తీర్ణంలో ఏయే పంటలు పండించాలో పేర్కొన్నారు. గత ఏడాది వర్షాకాలంలో వరి 40 లక్షల్లో సాగు చేస్తే.. ఈసారి అంతే విస్తీర్ణంలో పంట సాగు చేయాలన్నారు. గత ఏడాది 53 లక్షల ఎకరాల్లో పత్తి సాగు చేశారని.. ఈసారి కొంచెం పెంచి 70 లక్షల ఎకరాల్లో సాగు చేయాలని చెప్పారు.
గత ఏడాది 7 లక్షల ఎకరాల్లో కంది సాగు చేశారని.. ఈసారి 15 లక్షల ఎకరాల్లో సాగు చేయాలని చెప్పిన కేసీఆర్.. సోయాబీన్.. పసుపు.. మిర్చి.. కూరగాయలు తదితర పంటలు గత ఏడాది మాదిరే పండించుకోవచ్చన్నారు. మక్కల (మొక్కజొన్నలు) సాగు విషయంలో మాత్రం అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు. వర్షాకాలం లో మక్కలతో ప్రయోజనం ఉండదని.. దానికి బదులుగా కంది పంటను వేయాలన్నారు. వరి విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని.. మార్కెట్లో డిమాండ్ ఉన్న వాటినే పంటకు వేయాలన్నారు. 6.5ఎంఎం సైజున్న బియ్యానికి అంతర్జాతీయ మార్కెట్లో డిమాండ్ ఉందన్నారు. అందుకే.. ఆ రకం వరినే పండించాలన్న ఆయన మాటల్ని రైతులు ఎంతమేర ఓకే చేస్తారో చూడాలి.