దిశ రేప్, హత్య కేసు నిందితుల్ని పోలీసులు ఎన్ కౌంటర్ చేసేయగానే ఇకపై అమ్మాయిలపై అఘాయిత్యాలు ఆగిపోతాయని.. మృగాళ్లు భయపడతారనే భ్రమల్లోకి వెళ్లిపోయారు జనాలు. కానీ మన సొసైటీలో అంత సులువుగా మార్పు రాదనే సంకేతాలు ఇచ్చేలా ఘోరాలు కొనసాగుతూనే ఉన్నాయి. దిశ కేసు ఇంతగా సంచలనం రేపిన హైదరాబాద్‌లోనే తాజాగా మరో ఘోరం చోటు చేసుకుంది. ఒక ఫుడ్ డెలివరీ బాయ్.. మన భాగ్య నగరంలోనే ఒక మైనర్ బాలికపై అత్యాచారం చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. ప్రముఖ ఫుడ్ యాప్ స్విగ్గీలో అతను పని చేస్తున్నట్లు తెలిసింది. అతడి పేరు శివ. వయసు 21 అని వెల్లడైంది. హైదరాబాద్ కాచిగూడ ప్రాంతంలోని నింబోలిఅడ్డాలోని ఓ లేడీ హాస్టల్లో ఉంటున్న మైనర్ అమ్మాయిపై ఈ కుర్రాడు అఘాయిత్యానికి పాల్పడ్డాడట.
వివరాల్లోకి వెళ్తే.. ఈ హాస్టల్ వార్డన్ హాస్టల్లోని కొందరు అమ్మాయిలకు గేటు తాళాలు ఇచ్చిందట. తాను చెప్పిన వ్యక్తులెవరైనా వచ్చినపుడు మాత్రమే గేటు తాళాలు తెరవాలని ఆమె సూచించదట. ఐతే బాధితురాలు ఎవరి కోసమో గేటు తాళం తీశాక.. మళ్లీ తాళాలు వేయడం మరిచిపోయిందట. శివ అనే ఫుడ్ డెలివరీ బాయ్ తన స్నేహితులతో కలిసి గేటు దగ్గరికి వచ్చి వాచ్ మన్ ఫోన్ నుంచే సదరు అమ్మాయికి ఫోన్ చేయగా ఆమె గేటు దగ్గరికి వచ్చిందని.. శివ బృందం ఆమెను కిడ్నాప్ చేసి తీసుకెళ్లి అఘాయిత్యానికి పాల్పడ్డారని వెల్లడైంది. మియాపూర్లో మూడు రోజుల పాటు ఆ అమ్మాయిని ఉంచి దారుణానికి ఒడిగట్టినట్లు తెలుస్తోంది. బాలిక అదృశ్యంపై హాస్టల్ వార్డన్ పోలీసులకు ఫిర్యాదు చేయగా.. విచారణ చేపట్టి ఆ అమ్మాయి ఆచూకీ కనుగొని.. శివ, అతడి స్నేహితుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.