కొన్ని బ్రాండ్ల పేర్లు చెప్పినంతనే మరింకేమీ ఆలోచించకుండా నమ్మకం గా కొనేయొచ్చన్న ఫీలింగ్ ఉంటుంది. హైదరాబాద్ మహానగరానికి సంబంధించి చూస్తే.. స్థానికంగా మొనగాడి బ్రాండ్లలో ఒకటి పిస్తాహౌస్. రంజాన్ సీజన్ లో పిస్తాహౌస్ వారి హలీంకు ఉండే గిరాకీ అంతా ఇంతా కాదు. హైదరాబాద్ లోని ఏ గల్లీలోకి వెళ్లి చూసినా హలీం బట్టీలు పెద్ద ఎత్తున ఉన్నా.. సీజన్ మొత్తంలో ఒక్కసారైనా పిస్తా హౌస్ లో హలీం తినేందుకు మక్కువను ప్రదర్శిస్తుంటారు.
హలీం అన్నంతనే గుర్తుకు వచ్చే పిస్తా హౌస్ రెస్టారెంట్.. బేకరి.. స్వీట్లు.. ఛాయ్.. బిస్కెట్లు.. సమోసా ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే సేవల్ని అందిస్తుంటుంది. మరింత పేరుమోసి షాపులో ఊహించని రీతిలో విషయాలు చోటు చేసుకుంటాయా? నాణ్యతను పెద్దగా పట్టించుకోకుండా ఉంటారా? అంటే.. తాజా గా చోటు చేసుకున్న ఘటనను చూస్తే నిజమే అన్న అనుమానం కలగటం ఖాయం.
నిన్న (గురువారం) నిజాంపేట (జేఎన్ టీయూ నుంచి మియాపూర్ వెళ్లే దారిలో) రోడ్డు మీదుగా పెద్ద పిస్తా హౌస్ ఉంది. తమ బ్రాండ్ కున్న పేరుకు తగ్గట్లే భారీగా ఉండే ఈ తినుబండారాల దుకాణం నిత్యం హడావుడిగా..కళకళలాడుతూ ఉంటుంది. అలాంటిది బేకరీ ఉత్పత్తులు కొనేందుకు వెళ్లిన శ్రీనివాసరెడ్డి అనే వ్యక్తికి అక్కడి ఫుడ్ మీద బొద్దింకలు తిరగటాన్ని చూశాడు. వెంటనే.. అక్కడున్న సిబ్బందికి చెప్పగా.. వారు లైట్ తీసుకొన్నారు. అంత నిర్లక్ష్యంగా వ్యవహరించటాన్ని నొచ్చుకున్న అతను వెంటనే మూసాపూట సర్కిల్ ఏఎంహెచ్ వో డాక్టర్ సంపత్ కుమార్ కు ఫోన్ చేసి విషయాన్ని చెప్పారు.
వెంటనే ఆయన తన సిబ్బందిని పంపారు. బొద్దింకల విషయాన్ని సిబ్బంది పరిశీలించి.. అ పరిశుభ్రంగా ఉండటం తో రూ.20వేలుజరిమానాను విధించారు. బొద్దింకల విషయాన్ని ఫుడ్ ఇన్ స్పెక్టర్ కు ఫోన్ చేసి చెబితే ఎలాంటి స్పందన లేదని బాధితుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. పిస్తా హౌస్ కు చెందిన సీసీ కెమేరాల్ని పరిశీలిస్తే ఎవరూ పిస్తా హౌస్ లో ఆహార పదార్థాల్ని కొనేందుకు ఇష్టపడరని వెల్లడించాడు శ్రీనివాస రెడ్డి. మంచి పేరున్న బ్రాండ్లు సైతం.. సిబ్బంది నిర్లక్ష్యం.. యాజమాన్యాలు పట్టించుకోకపోవటంపై విస్మయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇదంతా విన్నంతనే దేవుడా.. అన్న ఫీలింగ్ కలుగక మానదు.