జాతీయ ఆహార భద్రతా చట్టం అమలులో రెండు తెలుగు రాష్ట్రాలకు భిన్నమైన ర్యాంకులు లభించాయి. ఆంధ్రప్రదేశ్ ర్యాంకుల్లో ముందు నిలవగా, తెలంగాణ వెనుక నిలిచింది. ఆహార భద్రతా చట్టం అమలులో ఆంధ్రప్రదేశ్ కు మూడో స్థానం లభించింది. ఇక తెలంగాణ 12వ స్థానంలో నిలిచింది.
కాగా ఒడిశా దేశంలోనే నంబర్ వన్ స్థానంలో నిలిచింది. రెండో ర్యాంకును ఉత్తర ప్రదేశ్ దక్కించుకుంది. కర్ణాటక 8, తమిళనాడు 9వ స్థానాల్లో నిలిచాయి. కేరళ 11వ స్థానం దక్కించుకుంది. మహారాష్ట్ర 13, జార్ఖండ్ లకు 19 స్థానాలు లభించాయి. అలాగే ప్రత్యే కేటగిరీ రాష్ట్రాల్లో త్రిపుర మొదటి స్థానంలో నిలవగా.. తర్వాతి స్థానాల్లో హిమాచల్ ప్రదేశ్, సిక్కిం ఉన్నాయి.
జాతీయ ఆహార భద్రతాచట్టం అమలుపై కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ వివిధ రాష్ట్రాల మంత్రులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఎన్ఎఫ్ఎస్‌ఏ ర్యాంకుల సూచీ-2022'ని ఆయన విడుదల చేశారు.
జాతీయ ఆహార భద్రతా చట్టం కింద రేషన్ దుకాణాల ద్వారా పేదలకు బియ్యం, గోధుమలు, ఇతర నిత్యావసరాలు సరఫరా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆహార భద్రతా చట్టం అమలు తీరును సూచీ లెక్కించింది.
జాతీయ ఆహార భద్రత చట్టం అమలులో రాష్ట్రాల ర్యాంకులను ట్విటర్ వేదికగా కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ వెల్లడించారు. తొలి రెండు స్థానాల్లో నిలిచిన ఒడిశా, ఉత్తర్‌ప్రదేశ్‌లకు మంత్రి పీయూష్ గోయల్ అభినందనలు తెలిపారు.
ఒకే దేశం-ఒకే రేషన్ కార్డు' లాంటి వ్యవస్థ ప్రపంచంలో మరెక్కడా లేదన్నారు. లబ్ధిదారులు దేశంలో ఎక్కడైనా ఈ పథకం ప్రయోజనాలు పొందే అవకాశం ఉందన్నారు.