ప్రపంచవ్యాప్తంగా ఫుల్ బాల్ ఆటకు ఫుల్ క్రేజ్ ఉంది. సాకర్ సీజన్ మొదలైందంటే చాలు అభిమానులు మ్యాచ్ కోసం చూసేందుకు ఎగబడుతుంటారు. అలాంటి ఫుట్ బాల్ ఆటలో దిగ్గజ ఆటగాడిగా పీలే (82) ఎదిగారు. గత కొంతకాలంగా పేగు క్యాన్సర్ తో బాధపడుతున్న పీలే నేడు తుది శ్వాస విడిచారు. దీంతో సాకర్ అభిమానులంతా శోకసంద్రంలో మునిగిపోయారు.
ప్రపంచవ్యాప్తంగా ఫుల్ బాల్ ను అభిమానించే వారంతా పిలే మృతి పట్ల సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ప్రముఖ క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్.. తదితర క్రీడా ప్రముఖలు.. రాజకీయ.. సినీ ప్రముఖులంతా ఆయన మృతిని జీర్ణించుకోలేక పోతున్నారు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఆయనకు ఘనంగా నివాళులు అర్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో #RipPile హ్యాష్ ట్యాగ్ నెట్టింట్లో ట్రెండింగ్ అవుతుంది.
ఒక్క భారత్ లోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సాకర్ అభిమానులకు ఆయన నివాళులు అర్పిస్తున్నారు. ఈక్రమంలోనే పుల్ బాల్ ఆటలో పిలే సాధించిన రికార్డులపై అభిమానులు మరోసారి గుర్తు చేసుకుంటున్నారు. బ్రెజిల్ కు చెందిన పిలేను పేదరికం నుంచి ప్రపంచ ఆటగాడిగా ఎదిగిన తీరు అద్వితీయం.
పీలేను సాకర్ ప్రపంచ కప్ ను విడదీసి చూడలేనంతగా ఆయన ఘనత సాధించాడు. పిలే ఫుట్‌బాల్‌నుంచి రిటైరై దాదాపు నాలుగున్నర దశాబ్దాలు అవుతున్నా సాకర్ పేరు చెబితే ముందుగా గుర్తుకు వచ్చే ఆటగాడు పిలేనే. క్రీడా ప్రపంచంలో పీలే తెలియని వారంటే అతిశయోక్తి కాదేమో. అంతలా అతడు ఫుట్ బాల్ ఆటపై తనదైన ముద్ర వేశారు.
దృఢమైన శరీరం.. అద్భుతమైన టెక్నిక్.. కళ్లు చెదిరే వేగం.. బంతిని అందుకోవడంలో చురుకుదనం..ప్రత్యర్థిని అయోమయంలో పడేసే డ్రిబ్లింగ్ .. వెరసి పిలే బరిలోకి దిగాడంటే గోల్ కొట్టకుండా వెనుదిరగని మేటి ఫార్వర్డ్ అతడి సొంతం. 17 ఏళ్ల వయస్సులో 1958 ఫిఫా ప్రపంచకప్‌లో బ్రెజిల్ తరఫున బరిలో దిగిన పీలే మూడు ప్రపంచక్‌ప్‌లు అందించి అభిమానులకు 'రియల్ హీరో'గా మారిపోయాడు.
పీలే తొలి అంతర్జాతీయ మ్యాచ్ 1957 జూలై 7 మరకనాలో అర్జెంటీనాపై జరిగింది. ఈ మ్యాచ్‌లో బ్రెజిల్ 2-1తో ఓటమి పాలైంది. బ్రెజిల్ తరపున పీలే తొలి గోల్ ఆ మ్యాచ్ లోనే జరిగింది. 16 ఏళ్ల 9 నెల వయస్సులో బ్రెజిల్ తరపున పిన్న వయస్సులో గోల్ చేసిన ఆటగాడిగా పీలే రికార్డు సృష్టించాడు.
అతడి చివరి అంతర్జాతీయ మ్యాచ్ 1971 జూలై 18న రియోడిజనెరోలో యుగోస్లోవియాపై జరిగింది. తన కెరీర్లో స్నేహపూర్వక మ్యాచ్‌లు సహా 1363 పోటీల్లో పిలే పాల్గొని 1279 గోల్స్‌తో గిన్నిస్ రికార్డుకెక్కాడు. బ్రెజిల్ తరపున 92 మ్యాచుల్లో 77 గోల్స్ చేశాడు. శాంటోస్ క్లబ్ తరపున 659 మ్యాచ్‌ల్లో 643 గోల్స్ సాధించాడు.
1958, 1962, 1970లలో వరల్డ్ కప్ ట్రోఫీలను సాధించాడు. వరల్డ్ కప్ లో ఆడిన 14 మ్యాచ్‌ల్లో 12 గోల్స్ చేశాడు. తన 1000వ గోల్‌ను 1969 నవంబరు 20న 909వ మ్యాచ్‌లో పూర్తి చేశాడు. 1978లో ఇంటర్నేషనల్ పీస్ అవార్డు సొంతం చేసుకున్నాడు. 1980లో ఫ్రెంచ్ క్రీడా ప్రచురణల సంస్థ ఎల్ ఎక్విప్ 'అథ్లెట్ ఆఫ్ ది సెంచరీ' అవార్డు అతడిని వరించింది.
1997లో ఎలిజిబెత్ రాణినుంచి గౌరవ నైట్‌హుడ్ దక్కింది. 1999లో అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ 'అథ్లెట్ ఆఫ్ ది సెంచరీ' అవార్డు దక్కింది. 20 శతాబ్దానికి చెందిన 100 మంది 'అత్యంత ముఖ్యమైన వ్యక్తు'ల టైమ్స్ అవార్డు-1999 పిలేను వరించింది. ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఫుట్‌బాల్ వరల్డ్ అండ్ స్టాటిస్టిక్స్ 'వరల్డ్ ప్లేయర్ ఆఫ్ ది సెంచరీ' అవార్డు-2000.. అదే ఏడాది డీగో మారడోనాతో కలిసి 'ఫిఫా ప్లేయర్ ఆఫ్ ది సెంచరీ' అవార్డు దక్కింది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.