స్నేహం రాజకీయాల్లో ఎంత మధురంగా ఉంటుందో పుటుక్కున తెగితే అంతే కఠినంగా ఉంటుంది. రాజకీయాలు అంటే అదే. శాశ్వత శత్రువులు శాశ్వత మిత్రులు ఇక్కడ ఎవరూ ఉండరు. ఇదిలా ఉంటే ఏపీలో టీడీపీ జనసేనల మధ్య మిత్ర బంధం నడుతోందని టాక్ అయితే ఉంది. కానీ ఎపుడూ అధికారికంగా అది ప్రకటించబడలేదు. అయితే సమీప భవిష్యత్తులో జరిగే వీలుందేమో తెలియదు.
కానీ దానికి ముందస్తు కసరత్తు అయితే చాలా బాగానే సాగుతోంది. పొత్తులు ఉంటే కనుక ఫలానా సీట్లు జనసేనకు ఇస్తారు అని ముందే అవగాహన ఉన్న వాట్లో సైకిల్ బ్రేకులు వేసుకుని తానుగా కూర్చుంది అని వార్తలు వసతున్నాయి. ఒకనాడు ఉమ్మడి ఏపీని ఏలిన పార్టీ విభజన తరువాత అయిదేళ్ళు ఏపీని ఏలిన టీడీపీ ఈ రోజుకీ కొన్ని సీట్లలో మూడవ స్థానంలో ఉందంటే షాకింగ్ న్యూసే. కానీ అది కావాలని టీడీపీ తానుగానే చేస్తోంది అంటే ఇంకా విచిత్రం.
ఇలా ఎందుకు అంటే మిత్రుడి కోసం అన్న మాట వినిపిస్తోంది. పవన్ కళ్యాణ్ తో పొత్తు కావాలి. అందుకే ఆయన కోసం కొన్ని సీట్లలో ఇప్పటికీ తన పార్టీని తానే వీక్ చేసుకుంటూ పవన్ పార్టీ బలాన్ని పెంచేలా టీడీపీ చేస్తున్న ఈ తెర వెనక మేనేజ్మెంట్ వల్ల నష్టపోతున్నది అచ్చంగా పసుపు పార్టీ తమ్ముళ్ళే.
అలా గోదావరి జిల్లాలో టీడీపీ మూడు సీట్లలో ఎలాంటి యాక్టివిటీని ఇపుడు పెద్దగా చేయడంలేదు అని అంటున్నారు. వాటిలో పవన్ 2019 ఎన్నికల్లో పోటీ చేసి ఓడిన భీమవరం ఉంది. ఇక్కడ పవన్ 2024లో మరోసారి పోటీ చేస్తారని టాక్ ఉంది. దాంతో టీడీపీ ఈ సీట్లో ఫుల్ సైలెంట్ అయింది అంటున్నారు. అలాగే నర్సాపురం సీటు విషయంలో కూడా టీడీపీ వైఖరి ఇలాగే ఉందిట.
ఇక్కడ జనసేనకు పట్టు ఎక్కువగా ఉంది. ఆ పార్టీ నుంచి బొమ్మిడి నాయకర్ అనే నాయకుడి రూపంలో జనసేనకు బలమైన నాయకత్వం ఉండటం విశేషం. ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ గా ఉన్న ప్రసాదరాజు. ఇక వైసీపీ నుంచి బయటకు వచ్చేసిన మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు టీడీపీలో చేరడానికి కూదా జనసేన పొత్తు అడ్డు వస్తోంది అని అంటున్నారు.
అలాగే రాజోలు లో కూడా జనసేన గట్టిగానే నిలబడింది. 2019 ఎన్నికల్లో ఇక్కడ నుంచి జనసేన గెలిచింది. రాపాక ప్రసాదరావు వైసీపీలోకి వెళ్ళిపోయినా క్యాండర్ ఫ్యాన్స్ పవన్ తోనే ఉన్నారు. దాంతో 2024లో బలమైన అభ్యర్ధిని పెట్టి రాపాకను ఓడించాలన్న పంతం జనసేనకు ఉంది. ఇవన్నీ తెలిసే ఇక్కడ టీడీపీ తన పార్టీని సైలెంట్ మోడ్ లో ఉంచింది అంటున్నారు.
ఇలా ఈ మూడింటా పోటీ అంటూ ఉంటే అది వైసీపీ జనసేనల మధ్యనే అని అంటున్నారు. ఇక్కడ టీడీపీ థర్డ్ ప్లేస్ లో ఉంటూ అదే తనకు చాలు అని త్యాగరాజుగా మారిపోయింది అంటున్నారు. ఇదంతా పవన్ని మంచి చేసుకునే యత్నమే అని చెబుతున్నారు. కానీ పవన్ కళ్యాణ్ పార్టీతో పొత్తు కనుక లేకపోతే అపుడు టీడీపీ పరిస్థితి ఏంటి అన్న దానికైతే ఇప్పటిదాకా జవాబు లేదు. అంటే విడిగా పోటీ చేసినా జనసేన వైసీపీతో ఢీ కొట్టే స్తోమత సంపాదించుకుంది అన్న మాట.
అదే టీడీపీ జనసేన పొత్తు లేదు తూచ్ అంటే మాత్రం థర్డ్ ప్లేస్ లో అలా ఉండాల్సిందే అని అంటున్నారు. ఇక ఇదే తీరున మరికొన్ని నియోజకవర్గాలలో జనసేన మేలు కోసం టీడీపీ తన పార్టీని తగ్గి ఉంచుతోంది అని కూడా ప్రచారంలో ఉంది. మరి ఇలా అయితే రేపటి రోజుల పొత్తులు కుదరకపోతే టీడీపీ భారీ మూల్యం చెల్లించుకుంటుందా అంటే అదే తమకు దిగులు అని తమ్ముళ్ళు అంటున్నారు.
అయినా పవన్ మిత్రుడి మీద అంత నమ్మకం లేకపోతే టీడీపీ హై కమాండ్ ఇలా చేస్తుందా. సో పొత్తులు ఖాయమనుకునే టీడీపీ అధినాయకత్వం ఈ సీట్లు ఇలా రాసిచ్చేస్తోంది అనుకోవాలి. మరి పొత్తుల ప్రకటన ఎపుడు అంటే ఎన్నికల ముందే అని అంటున్నారుట.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.