క్రికెట్ చరిత్రలో తొలిసారి 'టవల్' దెబ్బకు ఔట్ కాస్తా నాటౌట్!

Update: 2022-07-16 06:37 GMT
ఇంతవరకు ఎప్పుడూ జరగని రీతిలో.. ఆ మాటకు వస్తే క్రికెట్ చరిత్రలో తొలిసారి చోటు చేసుకున్న అనూహ్య పరిణామం ఆసక్తికరంగా మారటమే కాదు.. ఔట్ కాస్తా నాటౌట్ గా మారింది. దీంతో ఔట్ అయ్యారని ఆశించిన జట్టు అంపైర్ నిర్ణయంతో నిరాశ చెందారు. ఔట్ ను నాటౌట్ అన్న నిర్ణయాన్ని ఎలా ఇస్తారన్న చర్చ నేపథ్యంలో.. క్రికెట్ రూల్ బుక్ చూసినప్పుడు.. అంపైర్ నిర్ణయం సరైనదే అన్న విషయం వెల్లడి కావటంపై సదరు అంపైర్ మీద ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. క్రికెట్ చరిత్రలో ఇలాంటి సీన్ ఇంతకు ముందు ఎప్పుడూ చోటు చేసుకోలేదని చెబుతున్నారు. ఇంతకూ అసలేం జరిగిందంటే?
న్యూజిలాండ్.. ఐర్లాండ్ జట్ల మధ్య మూడు మ్యాచుల వన్డే సిరీస్ జరుగుతోంది.

ఇందులో భాగంగా జరిగిన రెండో మ్యాచ్ లో చోటు చేసుకున్న పరిణామం ఒకటి క్రికెట్ అభిమానుల మధ్య పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఈ మ్యాచ్ లో న్యూజిలాండ్ విజయం సాధించినప్పటికీ.. మ్యాచ్ మధ్యలో చోటుచేసుకున్న విషయం చర్చనీయాంశంగా మారింది. కివీస్ బౌలర్ బ్లెయిర్ టిక్నర్ గుండ్ లెంగ్త్ తో ఆఫ్ స్టంప్ అవతల బంతిని విసరటం.. క్రీజ్ లో ఉన్న సిమీ సింగ్ థర్డ్ మ్యాన్ దిశగా షాట్ ఆడే ప్రయత్నంలో కీపర్ కు క్యాచ్ ఇచ్చాడు. దీంతో.. ఇది కాస్తా క్లియర్ ఔట్ గా తేలింది.

దీనికి తగ్గట్లే బౌలర్ అప్పీల్ కు స్పందించిన అంపైర్ చేతి వేలు పైకి లేపి ఔట్ గా ప్రకటించి.. ఆ వెంటనే దాన్ని డెడ్ బాల్ గా ప్రకటించి.. ఔట్ కాస్తా నాటౌట్ గా తేల్చేశారు. దీనిపై కివీస్ ఆటగాళ్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీనికి స్పందించిన అంపైర్ ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. బౌల్ వేసే వేళలో.. అతడి నడుముకు పెట్టుకున్న టవల్ జారి క్రీజ్ మీద పడిందని.. అందుకే తాను ఆ బంతిని డెడ్ బాల్ గా ప్రకటించినట్లు చెప్పారు.

దీనికి సంబంధించిన క్రికెట్ రూల్ ను చెప్పినప్పటికీ కివీస్ ఆటగాళ్లు తొలుత సమాధాన పడనప్పటికి.. రూల్ బుక్ ను చెక్ చేస్తే.. అంపైర్ చెప్పింది అక్షర సత్యమన్న విషయం బయట పడింది. నిజానికి ఇలాంటి ఉదంతాలు చాలా అరుదుగా చోటు చేసుకుంటాయని చెప్పాలి.

ఇక.. క్రికెట్ రూల్ బుక్ ను చూసినప్పుడు.. రూల్ నెం.20.4.2.6 కింద  ఏవైనా శబ్దాలు .. ఏవైనా కదలికలు.. ఇంకా ఇతరత్రా చర్యలు స్ట్రైకింగ్ లో ఉన్న బ్యాట్సమెన్ ఏకాగ్రతతకు భంగం కలిగేలా ఫీల్డ్ అంపైర్ దాన్ని డెడ్ బాల్ గా ప్రకటించే అధికారం ఉంది.

ఇది మ్యాచ్ జరుగుతున్న మైదానంలో కానీ.. బయట కానీ.. ప్రేక్షకుల స్టాండ్ లో కానీ బాల్ పడితే దాన్ని డెడ్ బాల్ గా ప్రకటించే అధికారం అంపైర్ కు ఉంది. ఆ లెక్కన చూస్తే.. ఫీల్డ్  ీద బౌలర్ టవల్ జారి పడిన నేపథ్యంలో ఆ బాల్ ను డెడ్ బాల్ గా ప్రకటించటంలో తప్పు లేదనే చెప్పాలి. అనూహ్యంగా అవుట్ నుంచి బయటపడిన బ్యాట్ మెన్ మాత్రం.. కేవలం 16 పరుగులే చేసి ఔట్ కావటం గమనార్హం.




Full ViewFull ViewFull ViewFull ViewFull ViewFull View
Tags:    

Similar News