మొన్న హైదరాబాద్ సన్ రైజర్స్- కోల్ కతా నైట్ రైడర్స్ మ్యాచ్ చూసిన వారు.. సన్ రైజర్స్ గ్యాలరీలో తప్పకుండా ఈ అమ్మాయిని చూసే ఉంటారు. ఆటగాళ్లను తన చప్పట్లతో ప్రోత్సహించిన ఈ బ్యూటీ.. మ్యాచ్ చూసిన వారితో ‘భలేగా ఉందే’ అని అనిపించింది.
మనోళ్లు తక్కువోళ్లేం కాదుగదా! మనకు తెలియకుండా మన టీమ్ లోకి వచ్చిన ఈ కొత్త పిల్ల ఎవరబ్బా.. అంటూ సెర్చ్ చేయడం మొదలు పెట్టారు. కొత్త విషయం ఏదైనా తెలియజెప్పేది గూగుల్ తల్లే కాబట్టి.. ‘జై గూగుల్ మాత’ అంటూ.. ఆ బ్యూటీ చరిత్రను తవ్వడానికి ప్రయత్నించారట.
ఆ అందగత్తె మరెవరో కాదు.. ఒక రకంగా ఆ జట్టు యజమాని. పేరు కావ్యా మారన్. సన్ నెట్ వర్క్ అధినేత కళానిధి మారన్ కూతురు. ప్రస్తుతం సన్ రైజర్స్ జట్టుకు సీఈవోగా వ్యవహరిస్తున్నారు కావ్య. అంతేకాదు.. సన్ మ్యూజిక్, రెడ్ ఎఫ్ఎం చానెల్స్ లో పార్ట్ నర్ షిప్ కూడా ఉంది.
అయితే.. ఐపీఎల్ వేలాన్ని ఫాలో అయిన వారికి 2016లోనే ఈ బ్యూటీ కనిపించి ఉంటుంది. తొలిసారిగా అప్పుడే వేలానికి హాజరైంది. 2018 నుంచి జట్టుతో టచ్ లో ఉంది. 29 ఏళ్ల కావ్య.. డిగ్రీ పూర్తిచేయడంతోపాటు బిజినెస్ స్కూల్లోనూ పట్టా పట్టుకొని వచ్చింది. ఆ చదువునంతా ఇప్పుడు టీమ్ ను రన్ చేయడంలో చూపిస్తోందన్నమాట.