మహిళల కోసం మరో సరికొత్త ఫీచర్ను తీసుకువచ్చింది ఫేస్బుక్. ఉమన్ సేఫ్టీ హబ్ పేరుతో దీనిని ప్రవేశ పెట్టింది. దీనిని ఫేస్ బుక్ అనుబంధ సంస్థ అయిన ఇన్ స్టాగ్రామ్ లో కూడా అమలు చేయనుంది. దీని ద్వారా సోషల్ మీడియో మహిళలకు మరింత రక్షణ చేకూరుతుందని ఫేస్ బుక్ విశ్వాసం వ్యక్తం చేస్తోంది. దీనిలో భాగంగానే స్త్రీలకు సంబంధించి సున్నితమైన సమాచారాన్ని గోప్యంగా ఉంచేందుకు చర్యలు చేపడుతోంది. ఆన్లైన్ వేదికగా వారితో అసభ్యంగా ప్రవర్తించినా.. దురుసుగా మాట్లాడినా, వ్యక్తిగత దూషణలకు దిగినా వారి పై కఠిన చర్యలు తీసుకోనుంది. మెటా సంస్థకు సంబంధించిన ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్ లలో కూడా ఇవే నిబంధనలు అమలు కానున్నాయి.
వీటని పర్యవేక్షించేందుకు ఫేస్ బుక్ మాతృ సంస్థ మెటా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఉమన్ సేప్టీ అడ్వైజర్లను కూడా నియమించుకుంది. ఫేస్ బుక్ ఇప్పటికే పాగా వేసి ఉన్న ప్రముఖ దేశాలైన ఆస్ట్రేలియా, హాంకాంగ్, అమెరికా, బ్రెజిల్ లాంటి వివిధ దేశాల నుంచి ఈ ఉమన్ సేఫ్టీ అడ్వైజర్లను నియమించుకుంది. వీరి ఆధ్వర్యంలో సంస్థ ఉమన్ సేఫ్టీ టూల్ కిట్ అనే దానిని రూపొందించింది. ఆన్ లైన్ లో మహిళలలు ఎదుర్కొంటున్న వేధింపులపై వీరంతా చర్చించి నిర్ణయం తీసుకుంటారు. ఇందుకు వారు ఆ అకౌంట్ ను రిపోర్ట్ కొట్టాల్సి ఉంటింది. అప్పుడే ఈ వీరు దానికి సంబంధించిన చర్యలను తీసుకోగలుగుతారు. ఇదిలా ఉంటే ఫేస్ బుక్ కు ఎక్కువ మంది యూజర్లు ఉన్న భారత దేశం నుంచి ఉమన్ సేఫ్టీ అడ్వైజరీ కమిటీలో ఒక్కరు కూడా లేరు. ఇందుకు గల కారణాను సంస్థ వెల్లడించలేదు. కానీ ఈ పైలెట్ ప్రాజెక్ట్ సక్సెస్ అయితే మాత్రం మరింత మందిని తీసుకునేందుకు చర్యలు తీసుకుంటామని మెటా తెలిపింది.
ఎవరైనా పెట్టిన పోస్ట్ కు స్పందన మహిళలు వారి సామాజిక, వ్యక్తిగత, రాజకీయ అభిప్రాయాలను తెలియ చేసేందుకు ప్రస్తుతం వీలుంది. అయితే కొంద మంది ఇలా కామెంట్ చేసిన వారిని ఉద్దేశించి ఇష్టం వచ్చినట్లుగా నోటికి వచ్చినట్లు కామెంట్ల రూపంలో విరుచుకుపడుతుంటారు. మాటలతో మానసికంగా హింసిస్తారు.
ఇలాంటి వారికి చెక్ చెప్పడానికి ఇది ఉపయోగపడుతుందని ఫేస్ బుక్ తెలిపింది. అసభ్య పదజాలంతో మహిళలను బూతులు తిట్టడం, కులం పేరుతో దూషించడం లాంటివి చేస్తే వారి అకౌంట్ ను ఫేస్ బుక్ బ్లాక్ చేయనుంది. ఇందుకుగానూ ఇంగ్లీషుతో పాటు భారత్ లోని సుమారు 14 భాషల్లో ఈ ఉమన్ సేఫ్టీ టూల్ కిట్ ను అందుబాటులోకి తీసుకువచ్చింది.
ఫేస్ బుక్ తీసుకువచ్చిన ఈ ఉమన్ సేఫ్టీ హబ్ అనే దానిపై సాంకేతిక నిపుణులు పెదవి విరుస్తున్నారు. ఇప్పుడు ఉన్న ఫేసుబుక్ కమ్యునిటీ గైడ్ లైన్స్ లోని వాటినే తీసుకుని మరలా కొత్తగా పెట్టిందని ఆరోపిస్తున్నారు.