తెలుగుదేశం పార్టీలో పరిచయం అక్కర్లేని పేరు గోరంట్ల బుచ్చయ్య చౌదరిది. 2019 వైసీపీ హవాలోనూ నిలిచి గెలిచిన కొద్దిమంది టీడీపీ ఎమ్మెల్యేలలో ఆయనా ఒకరు. రాజమండ్రి రూరల్ నియోజకవర్గం నుంచి గత రెండు పర్యాయాలుగా వరుసగా గెలిచిన ఆయన గత ఎన్నికల్లో జనసేన 22 శాతం ఓట్లు చీల్చినా కూడా విజయం అందుకున్నారు. ఇప్పటివరకు ఆరుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన గోరంట్ల పార్టీ వాయిస్ వినిపించడంలో ముందుంటారు. ట్రాక్ రికార్డ్ ఎంత బాగున్నా ఈసారి ఆయనకు పోటీ చేసే అవకాశం లేనట్లేనని టీడీపీ వర్గాల నుంచి వినిపిస్తోంది. ముఖ్యంగా జనసేనతో టీడీపీ పొత్తు ఫైనల్ అయితే గోరంట్లకు టికెట్ ఎట్టిపరిస్థితుల్లో రాదని సమాచారం. గత ఎన్నికల్లో 40 వేలకు పైగా ఓట్లు సాధించిన జనసేనకు ఆ సీటు పొత్తుల్లో భాగంగా ఇస్తారని తెలుస్తోంది. అదే జరిగితే గోరంట్లకు బలవంతంగా రిటైర్మెంట్ ఇచ్చినట్లే.
జనసేన ఫ్యాక్టర్ ఒక్కటే కాకుండా అనేక ఇతర అంశాలూ గోరంట్ల బుచ్చయ్య చౌదరికి ప్రతికూలంగా మారాయి. ముఖ్యంగా స్థానికంగా సొంత పార్టీ నేతలతోనూ ఆయనకు వైరాలున్నాయి. గత కొంతకాలంగా టీడీపీ అధిష్టానంపైనా ఆయన అనేకమార్లు అలకబూనడం కూడా పార్టీ పెద్దలకు నచ్చలేదు. దీంతో రాజమండ్రి సిటీలో ఆదిరెడ్డి అప్పారావు కుటుంబంతో ఆయనకు ఉన్న వైరం కూడా ప్రతికూలంగా మారింది. ఒకప్పుడు రాజమండ్రి సిటీ నుంచే గెలుస్తూ వచ్చిన బుచ్చయ్య చౌదరిని 2014 నుంచి రాజమండ్రి రూరల్ సీటుకు పంపించారు. రాజమండ్రి సిటీ నియోజకవర్గం నుంచి నాలుగుసార్లు గెలిచిన బుచ్చయ్య 2004, 2009లో మాత్రం ఓటమి పాలయ్యారు.
2014లో రాజమండ్రి సిటీ స్థానం పొత్తుల్లో భాగంగా బీజేపీకి కేటాయించి బుచ్చయ్యను రాజమండ్రి రూరల్‌కు పంపించగా అక్కడ ఆయన విజయం సాధించారు. 2019లో మళ్లీ ఆయన రాజమండ్రి సిటీకి రావాలని ప్రయత్నించినా ఆదిరెడ్డి భవానీని పార్టీ అక్కడఅభ్యర్థిగా ప్రకటించి బుచ్చయ్యను రూరల్‌లోనే కొనసాగించింది. 2019లో భవానీ వైసీసీ ఎదురుగాలిలోనూ 30 వేల మెజారిటీతో గెలిచి అక్కడ పాగా వేయడంతో బుచ్చయ్య చౌదరికి రాజమండ్రి సిటీ స్థానంపై ఆశలు వదులుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
2019 ఎన్నికల్లో భవానీ గెలుపు తరువాత ఆమె భర్త ఆదిరెడ్డి వాసు నిత్యం ప్రజల్లో ఉంటూ బుచ్చయ్యకు అవకాశం లేకుండా చేయడంతోపాటు కింజరాపు ఎర్రన్నాయుడి అల్లుడిగా పార్టీ అధిష్ఠానం దగ్గరా పట్టు పెంచుకున్నారు. వచ్చే ఎన్నికల్లో ఆయన టికెట్ ఆశిస్తుండడంతో రాజమండ్రి సిటీ స్థానంపై బుచ్చయ్య పెట్టుకున్న ఆశలు ఆవిరైనట్లే.
దీంతో ఇటు రాజమండ్రి సిటీ స్థానం పోయి.. అటు రూరల్ స్థానం పొత్తుల్లో వదులుకుంటే బుచ్చయ్య చౌదరికి పోటీ చేయడానికి నియోజకవర్గం లేనట్లే. మరి బుచ్చయ్య దీనంతటికీ ఊ అంటారో.. ఊహూ అంటారో చూడాలి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.