తెలంగాణ నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్‌తో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మాట్లాడడానికి సంబంధించి ఫోరెన్సిక్ సైన్స్ లేబరేటరీ నివేదికలో ఏముంది? స్టీఫెన్సన్ ఫోనులోనే దానిని రికార్డు చేశారని ఎఫ్‌ఎస్‌ఎల్ తేల్చి చెప్పిందా? లేక మరొకరి ఫోనులో రికార్డు చేసి దానిని స్టీఫెన్సన్ ఫోనులో పెట్టారని పేర్కొందా? బుధవారం నుంచి వస్తున్న రకరకాల కథనాలో నెలకొన్న ఉత్కంఠ ఇది.
చంద్రబాబుతో స్టీఫెన్సన్ మాట్లాడిన ఆడియోకు సంబంధించి దానిని ఎక్కడ రికార్డు చేశారనేది కీలకంగా మారనుంది. దానిని స్టీఫెన్సన్ ఫోనులోనే రికార్డు చేస్తే ఎటువంటి ఇబ్బంది లేదు. అది చంద్రబాబు గొంతు అని తేలిపోయింది కనక ఆయన చిక్కుల్లో పడతారు. కానీ, అది స్టీఫెన్సన్ ఫోనులో కాకుండా మరొకరి ఫోనులో రికార్డు చేసి దానిని స్టీఫెన్సన్ ఫోనులో పెట్టారని ఎఫ్‌ఎస్‌ఎల్ నివేదిక ఇస్తే ఈ కేసు కీలక మలుపు తిరుగుతుంది. మళ్లీ ఫోన్ ట్యాపింగ్ వివాదం తెరపైకి వస్తుంది. అవతల ఫోను చేసింది టీడీపీకి చెందిన సెబాస్టియన్. ఇవతల మాట్లాడింది స్టీఫెన్సన్. సెబాస్టియన్ ఫోనులో రికార్డు చేసే అవకాశం లేదు. స్టీఫెన్సన్ ఫోనులో రికార్డు చేయలేదు. అంటే ఫోను ట్యాపింగ్ చేసినట్లేనని టీడీపీ వాదించే అవకాశం ఉంది. దాంతో చంద్రబాబు మాట్లాడిన దానికంటే కూడా ఫోను ట్యాపింగ్ మరోసారి వివాదం కానుందని విశ్లేషకులు వివరిస్తున్నారు.
ఆరోజు ఆడియోలో ఫోను రింగు నుంచీ వినిపించింది కనక అది స్టీఫెన్సన్ ఫోనులో రికార్డు చేసింది కాదని కూడా వివరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎఫ్‌ఎల్‌ఎల్ నివేదిక కీలకంగా మారనుంది.