బీజేపీకి టీడీపీ శత్రువు కాదు.. వైసీపీ ఫ్రెండూ కాదని బీజేపీ మాజీ ఎంపీ టీజీ వెంకటేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అసలు రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఎవరూ ఉండరంటూ హాట్ కామెంట్స్ చేశారు. వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంతో అత్యంత సన్నిహిత సంబంధాలు నెరపుతోంది. బీజేపీ ప్రభుత్వం ఏదైనా అంశంలో మద్దతు అడిగినా, అడగకపోయినా ముందుగానే వైసీపీ మద్దతు ప్రకటిస్తోంది.
ఇక గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో టీడీపీ–బీజేపీ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. బీజేపీలో ఇద్దరికి మంత్రి పదవులు కూడా లభించాయి. కామినేని శ్రీనివాస్, పైడికొండల మాణిక్యాలరావు మంత్రులుగా పనిచేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత మారిన పరిస్థితుల్లో ఈ రెండు పార్టీల మధ్య అభిప్రాయ భేదాలు ఏర్పడ్డాయి.
ఈ నేపథ్యంలో టీజీ వెంకటేష్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వైసీపీ ప్రభుత్వంపై అధికారుల్లో సైతం అసంతృప్తి ఉందన్నారు. ప్రభుత్వంపై ప్రజల్లో కూడా వ్యతిరేకత పెరుగుతోందని చెప్పారు. వైసీపీ ప్రభుత్వం కుల వృత్తులను నిర్లక్ష్యం చేస్తోందన్నారు. రాష్ట్రానికి పరిశ్రమలు కూడా రావడం లేదని గుర్తు చేశారు. రాయలసీమ డిక్లరేషన్ కు బీజేపీ కట్టుబడి ఉందన్నారు. కర్నూలులో హైకోర్టు ఏర్పాటుకు బీజేపీ కట్టుబడి ఉందన్నారు. వైసీపీ ప్రభుత్వం కర్నూలులో హైకోర్టు ఏర్పాటుకు అసెంబ్లీలో తీర్మానం చేయాలని కోరారు.
జనసేనతోనే వచ్చే ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తామని టీజీ వెంకటేష్ తెలిపారు. కాగా టీడీపీ ప్రభుత్వ హయాంలో ఆ పార్టీ తరపున రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికైన టీజీ వెంకటేష్.. గత ఎన్నికల్లో టీడీపీ ఓడిపోయాక సీఎం రమేష్, సుజనా చౌదరి, గరికపాటి రామ్మోహన్ రావు తదితరులతో కలిసి బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే. టీజీ వెంకటేష్ పదవీ కాలం పూర్తయింది.
ఫార్మాస్యూటికల్ కంపెనీల అధినేత అయిన టీజీ వెంకటేష్ తన కుమారుడు భరత్ ను కర్నూలు నుంచి ఎమ్మెల్యేగా గెలిపించుకోవాలనే ప్రయత్నాల్లో ఉన్నారు. టీజీ వెంకటేష్ బీజేపీలో ఉన్నా ఆయన కుమారుడు భరత్ మాత్రం కర్నూలు టీడీపీ ఇన్‌చార్జిగా ఉండటం గమనార్హం.
ఈ నేపథ్యంలో ఆర్థికంగా బలవంతుడైన టీజీ వెంకటేష్ వచ్చే ఎన్నికల్లో తన కుమారుడిని గెలిపించుకోవాలనే ప్రయత్నాల్లో ఉన్నారు. అందుకే ఇప్పుడు రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరని వ్యాఖ్యానిస్తున్నారని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. టీడీపీతో పొత్తు కూడా అవసరమే అనేది ఆయన వ్యాఖ్యల వెనుక పరమార్థం అంటున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.