మొన్నటివరకు తెలుగు న్యూస్ ఛానెల్స్ లో ఒకటిగా వెలుగొందిన ఎక్స్ ప్రెస్ టీవీ వ్యవస్థాపకుడు చిగురుపాటి జయరాం మృతిచెందారు. కృష్ణా జిల్లా నందిగామ మండలం ఐతవరం సమీపంలో 65 నెంబర్ జాతీయ రహదారి పక్కన నిలిచిఉన్న కారులో జయరాం మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. మొన్నటివరకు విదేశాల్లో ఉండి వచ్చిన జయరాం, ఎప్పుడు ఇండియాకు వచ్చేరానే విషయంపై ఎవరికీ అవగాహన లేదు. అంతలోనే ఆయన మృతదేహం రోడ్డు పక్కన కనిపించింది.
జయరాం మృతిపై పలు అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. ఆయన వెనక సీట్లో పడిఉన్నారు. తలపై పెద్ద గాయమైంది. డ్రైవర్ కనిపించ లేదు. కారుకు ఎలాంటి దెబ్బలు తగల్లేదని అంటున్నారు పోలీసులు. రాత్రిం 10 గంటల 22 నిమిషాలకు జయరాం కారు చిల్లకల్లు టోల్ గేట్ దాటినట్టు పోలీసులు గుర్తించారు. ఆ తర్వాత 11 గంటల 20 నిమిషాలకు కృష్ణా జిల్లా నందిగామ మండలం ఐతవరం గ్రామం హైవే పక్కన ఆయన కారు ఆగి ఉన్నట్టు గుర్తించారు. కారులో జయరాం మృతదేహాన్ని గుర్తించారు.
ఎక్స్ ప్రెస్ టీవీకి ఎండీగా వ్యవహరించిన జయరాం, తన సంస్థలో పనిచేసిన ఉద్యోగులకు దాదాపు 6 నెలల జీతాలు ఎగ్గొట్టారు. దీనిపై అప్పట్లో ఆయన అరెస్ట్ కూడా అయ్యారు. ఆ తర్వాత ఛానెల్ ను లాకౌట చేయడంలో ఉద్యోగులు రోడ్డున పడ్డారు. ఆ కేసు ఇంకా నడుస్తోంది. ఇంతలోనే ఆయన ఆయన మృత్యువాత్ పడ్డారు.