మారుతీ సుజుకి మాజీ ఎండీ జగదీష్ ఖట్టర్ మృతి

Update: 2021-04-26 12:30 GMT
ఆటోమోటివ్ సేల్స్ అండ్ సర్వీస్ కంపెనీ కార్నేషన్ ఆటో ఇండియా వ్యవస్థాపకుడు, మారుతి సుజుకి మాజీ మేనేజింగ్ డైరెక్టర్ జగదీష్ ఖట్టర్ గుండెపోటుతో సోమవారం కన్నుమూశారు. జగదీష్ 1993 నుంచి 2007 వరకు మారుతీ ఉద్యోగ్ లిమిటెడ్‌ కు మేనేజింగ్ డైరెక్టర్‌గా విధులు నిర్వహించారు. ఆయన 1993లో మారుతీ సుజుకిలో మార్కెటింగ్ డైరెక్టర్‌ గా చేరారు. ఆ తర్వాత అదే సంస్థకి  1999లో ఎండీగా ఎదిగారు. మొదట ప్రభుత్వ నామినీగా, తర్వాత 2002లో సుజుకి మోటార్ కార్పొరేషన్ నామినీ ఎండీగా ఎదిగారు. మారుతీ సుజుకితో ఒప్పందానికి ముందు ఖట్టర్ సుమారు 37 ఏళ్ల పాటు ఐఏఎస్ అధికారిగా అనుభవం కలిగి ఉన్నారు.

2008లో ఖట్టర్ ఆటోమొబైల్ రంగంలో స్వతంత్రంగా మల్టీ బ్రాండెడ్ ఇండియా సేల్స్ అండ్ సర్వీసెస్ నెట్‌ వర్క్ కారేషన్‌ ను ప్రారంభించారు. కార్నేషన్ ఆటో ఇండియా బ్యాంకుకు రూ. 110 కోట్ల మోసం చేసినట్టు ఆరోపణలను కూడా జగదీష్ ఖట్టర్ ఎదుర్కొన్నారు. జగదీష్ ఖట్టర్ మరణం పట్ల మారుతీ సుజుకి ఛైర్మన్ ఆర్ సి భార్గవ దిగ్భ్రాంతిని వ్యక్తం చేసారు. జగదీష్ మరణం వ్యక్తిగతంగా కోలుకోలేని నష్టమన్నారు. పరిశ్రమ వర్గాలు సైతం ఖట్టర్ మృతి ఆటో రంగానికి తీరనిలోటు అని అభిప్రాయపడ్డాయి. ఈ రోజు మారుతి సుజుకి కంపెనీ ఒక గొప్ప స్థాయిలో ఉంది అంటే దానికి జగదీష్ కట్టర్ సేవలు కూడా ఒక కారణం అంటారు మార్కెట్ నిపుణులు. కట్టర్ హయాంలోనే మారుతి ఆల్టో, స్విఫ్ట్‌ కార్లు తయారు అయ్యాయి. 2007 లో పదవీ విరమణ చేసిన తరువాత, పాన్ ఇండియా మల్టీ-బ్రాండ్ ఆటోమొబైల్ సేల్స్ అండ్ సర్వీసెస్ సంస్థ ‘కార్నేషన్’ ను ప్రారంభించారు. ఎన్నో కొత్త మోడల్ కార్లు మార్కెట్లోకి వస్తున్నప్పటికీ ఆయన నాయకత్వంలో మారుతి కంపెనీ తన మార్కెట్ నుకొనసాగిస్తూ వస్తుంది.
Tags:    

Similar News