ఆయనకు 75 ఏళ్లు. అయితే, భార్య చనిపోయి మూడు మాసాలు కూడా గడవకుండానే.. రెండో పెళ్లి చేసుకున్నాడు. అదేమని.. బంధువులు అడిగితే.. రాత్రుళ్లు నిద్రపట్టడం లేదని..
నిర్మొహమాటంగా చెప్పేశాడు. దీంతో వారు చేసేది ఏమీ లేక.. వచ్చి భోజనం చేసి ఆశీర్వదించి వెళ్లారు. ఇప్పటికే ఈ మహానుభావుడికి.. మనవలు.. వాళ్లకు పిల్లలు.. వాళ్ల పిల్లలు కూడా పెళ్లీడుకు వచ్చిన వారు ఉండడం గమనార్హం.
మరి ఈ చిత్రమైన ఘటన ఎక్కడో జరగలేదు. మన పొరుగు రాష్ట్రం కర్ణాటకలోనే జరిగింది. ఈ ఘనుడు కూడా ఎవరో కాదు.. బీజేపీ నాయకుడు, మాజీ మేయర్ కావడం గమనార్హం. కర్ణాటకలోని హుబ్లీ ధార్వాడ్కు చెందిన మాజీ మేయర్ డీకే చవాన్ 75 ఏళ్ల వయసులో రెండోసారి పెళ్లి చేసుకున్నారు. మూడు నెలల క్రితం భార్య మరణించగా ఆమె సోదరి అనసూయతో తాజాగా ఏడడుగులు వేశారు. ఈ వివాహ వేడుకకు ఆయన కుటుంబసభ్యులతో పాటు బంధు మిత్రులు హాజరయ్యారు.
ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో ఈయన పెళ్లి విషయం చర్చనీయాంశంగా మారింది. దీనిపై మీడియా చవాన్‌ను ప్రశ్నించింది. దీనికి ఆయన నిర్మొహమాటంగా.. చెప్పిందేంటంటే.."నేను తప్పు చేశానని మీరు అనుకుంటున్నారా? ఒకవేళ నేను పెళ్లి చేసుకోకుండా.. బయట తిరిగితే..
ఏమనేవారు? తప్పుడు పనులు చేస్తున్నారని.. అనేవారు కదా!అది నాకు, పార్టీకి కూడా చెడ్డపేరు. అందుకే.. పెళ్లి చేసుకున్నాను. అది కూడా నాభార్య చెల్లెలు అయితే.. ఎలాంటి అరమరకలు ఉండవు. ఇది తప్పు కాదు. ఇలా చేయడం వల్ల దేశంలో ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తాను" అని నొక్కి వక్కాణించడం గమనార్హం.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.